————- శ్రీనివాస స్వీయ రచన ————-
నిజం నిప్పురా, నలుగురికీ చెప్పరా, లేకుంటే ముప్పురా
నిజం అప్పురా, తీర్చేస్తే గొప్పరా, వడ్డీయే తప్పురా
చెవిలో సీసం పోసినట్టు కంటిలో కారం చల్లినట్టు భరించలేమసలు సత్య గరళాన్ని గుండెలో దాచుకుంటే
నిజం తెలిసిన వాడి నవ్వు ప్రశ్నార్థకమో లేక ఆశ్చర్యార్థకమో తెలియదు!
కానీ ఎదుటి వాడికి తెలిసిపోతుంది నువ్వు ఏదో బరువు మోస్తున్నావని
గోడలకి చెవులే కాదు టివీ9 కళ్ళూ ఉంటాయ్
చీకటి బాగోతాల్నీ, బల్ల కింద చేతుల్నీ వెలుగులోకి తెస్తుంటాయ్
చివరికి నిజానికీ విసుగొస్తుంది – ప్రపంచం ముందు తేనే ముద్దాయిలా నిలబడుతుంది
పట్టు పరుపుల మీద దొర్లిన పరువంతా పాపం కోర్టు బోనులో నీరసించి చతికిలపడి పోతుంది
శ్వేతసౌధంలా అశ్లీల చిత్రమవుతుంది.

RTS Perm Link