ఎన్ని వేల వర్ణాలో…

Archive for July, 2006


నమ్మకం

Jul 31, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
ఎప్పుడో ఈ కథని ద హిందూ వారి సప్లిమెంట్ అయిన యంగ్ వరల్డ్ లో చదివాను. దీనిని దేవుడిని ఉద్దేశ్యంగా తీసుకుని కాకుండా నమ్మకాన్ని ఉద్దేశ్యంగా అనుకుని చదవండి.

ఒకసారి ఓ పర్వతారోహకుడు ఓ మంచు శిఖరాన్ని తాడు ఆధారంతో ఎక్కుతున్నాడు. అప్పటికే సాయంత్రమవడంతో చలి బాగా పెరిగింది. ఎలాగైనా అక్కడున్న హిమరహిత ప్రదేశాన్ని చేరుకోవాలని గబగబా పైకి వెళుతున్నాడు. రాత్రి ముసురుకోవడంతో కన్ను కానరాక అదుపుతప్పి క్రిందకి జారిపోసాగాడు. కొంతసేపటికి గాలిలో వేళాడుతున్న అనుభూతి… ఆ చీకటిలో ఎక్కడ ఉన్నాడో తెలియని అయోమయం… కనీసం నేల మీద ఉన్నా రాత్రిపూట ఎక్కడికన్నా వెళ్ళి తలదాచుకోవచ్చు… ఇలా దొరికిపొయాను అని అనుకుంటూ ఏమి చేయాలో తెలియక ‘భగవంతుడా! నువ్వే నాకు దిక్కు; ఎలాగైనా నన్ను కాపాడు.’ అంటూ దేవుడిని వేడుకున్నాడు. వెంటనే ‘నీ దగ్గర ఉన్న కత్తితో నువ్వు వేళాడుతున్న తాడుని కోసేస్తే నువ్వు విముక్తుడివి అవుతావు’ అంటూ అతడికి ఆకాశవాణి వినిపించిది.దానికి అతడు భయంతో ‘అలా చేస్తే నేను కిందకి పడి చచ్చిపోతాను’ అంటూ దేవుడిని నిందించసాగాడు.చలికి తట్టుకొలేక గడ్డకట్టుకుపొయాడు.

మర్నాడు అక్కడకు వచ్చిన కొంతమందికి నేలకు ఓ పది అడుగుల ఎత్తులో వేళాడుతున్న ఆ పర్వతారోహకుడి శవం కనిపించింది.

RTS Perm Link

తేటగీతిలో నా కవితలు

Jul 30, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
అప్పుడెప్పుడో సరదాగా చంధస్సులో రాద్దామని అనిపించింది. కాస్త సులువుగా ఉంటుందని తేటగీతిని జీర్ణం చేసుకుని ఇలా త్రేన్చాను 🙂

చంధస్సులో దోషాలుంటే మన్నించండి.

పలుకుజెలి పదముల పంచనె నిలిపెద
నే రచించు కవిత ఏదయినను
సాహితీప్రియులొకపరి చదివిన చాలు
నపుడె నాదు జన్మ ధన్యమగును

విరులు కురిసేటి మధుమాస వేళలోన
కన్నెకోయిల కూసేటి గడియలోన
హాయిగొలిపేటి చల్లని క్షణములోన
ఆమె తొలి దివ్యదర్శనం గలిగె నాకు

సుదలొలుకు కులుకుల ఎల సుమము నీవు
హాయిగొలుపు చంద్రకిరణ కాంతి నీవు
సిరిని మించు తళుకులొల్కు చెలువు నీవు
నిర్మలమగు హృదయమున్న ప్రియవు నీవు

ఎందరతివలు కనబడ్డ నింతవరకు
కనులు సంతసించెనుగాని మనసు కాదు
ఇపుడు జూచితిని చెలియా నిన్ను నేను
మనసు పొంగుతున్నది గాని తనువు కాదు

గంగ ఒడ్డున నా చెలి అడుగుపెడితె
అలలు మెల్లగ ఆమె పాదాల్ని తాకె
తనలొ కలుపుకున్నట్టి పాతకములన్ని
ఇటులె తొలగేనని తలచెనేమొ గంగ!

పూజకై వెలిగించు కర్పూరమసలు
బాదపడదు ప్రియా తాను మండుతుంటె
అటులనే నా మనసును హారతిగజేసి
నిన్ను పూజించు నీ వాడిని కనికరించు

కాంతినీయని ప్రమిదని కాంచనేల
తావినీయని పూవుని తాకనేల
సడియె ఎరుగని వీణను మీటనేల
ప్రేమ పంచని మనసుపై ప్రీతి ఏల?

RTS Perm Link

చీరలో నువ్వు బాగున్నవు

Jul 27, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
చీరలో నువ్వు బాగున్నావు – విచ్చుకున్న మల్లెలా ఉన్నావు
తెలుగుతనముకే మూర్తివైనావు – మగువతనముకే విలువ పెంచావు
కంటిచూపులో కరుణ నింపావు – కోటి దేవతలను నువ్వు మించావు
లేతనవ్వుతో చలువ పంచావు – జాబిలమ్మనే ఇలకు దించావు
పూలవనములా నడిచి వచ్చావు – పరిమళాలను గాలికిచ్చావు
పాలకడలిలా ప్రేమ చిలికావు – నాదు గుండెలో దాన్ని ఒంపావు

RTS Perm Link

నవ్వాలి నవ్వాలి మై డియర్ ఫ్రెండ్ నువ్వు కిలకిల నవ్వాలి మై డియర్ ఫ్రెండ్
బాదలన్ని మరచిపోయి మై డియర్ ఫ్రెండ్ నువ్వు పువ్వులా నవ్వాలి మై డియర్ ఫ్రెండ్
అందరికీ వస్తాయి కష్టాలు ఎప్పుడోకపుడు
అవి భయపడిపోతాయి వింటే నవ్వుల చప్పుడు
మొనాలిసా నీకు అక్కలా … నవ్వాలి నవ్వాలి మైడియ్ర్ ఫ్రెండ్
మౌనంగా పలకరించే మధురభాషిణి ఈ నవ్వు
చీకటినే కరగదీసే ఉదయరాగిణి ఈ నవ్వు
కష్టాల ఏరుని దాటించే నావ ఈ నవ్వు
నీకు నీవుగా ఇచ్చుకునే ఓదార్పు ఈ నవ్వు
వెన్నెల కూడా చిన్నబోదా ప్రియురాలి నవ్వుని చూసిందా
శిశిరం కూడా పారిపోదా స్నేహితుడే నవ్వుతు తోడుంటే
ఒంతరితనమే మనసుకి శాపం – బ్రతుకుని ఒంటరిగా వదిలేస్తే పాపం
ఆటాపాటా ఉన్నాయి అందుకే – నవ్వుతూ బాదలన్నీ మరచిపోయేందుకే
కన్నీళ్ళనూ మరి చేరదీసి ఆదరంచేది ఈ నవ్వు
నూరేళ్ళు నిన్నూనన్ను బ్రతికించే సంజీవని ఈ నవ్వు
పైసా సంపాదనలో అన్నీ మరచినవాడికి నవ్వడానికి టైము ఉండదు
ప్రేమే ఆలంబనగా బ్రతికే పేదవాడికి నవ్వడానికి పైసా ఖర్చు ఉండదు

RTS Perm Link

RTS Mirror Widget


from JalleDa

పంచాంగం


Warning: fsockopen(): php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: fsockopen(): unable to connect to udp://whois.happyarts.net:8000 (php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known) in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: stream_set_timeout() expects parameter 1 to be resource, boolean given in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 125