చీరలో నువ్వు బాగున్నవు

రాసినవారు శ్రీనివాస on Thursday, 27 of July , 2006 at 8:48 pm

చీరలో నువ్వు బాగున్నావు - విచ్చుకున్న మల్లెలా ఉన్నావు

తెలుగుతనముకే మూర్తివైనావు - మగువతనముకే విలువ పెంచావు

కంటిచూపులో కరుణ నింపావు - కోటి దేవతలను నువ్వు మించావు

లేతనవ్వుతో చలువ పంచావు - జాబిలమ్మనే ఇలకు దించావు

పూలవనములా నడిచి వచ్చావు - పరిమళాలను గాలికిచ్చావు

పాలకడలిలా ప్రేమ చిలికావు - నాదు గుండెలో దాన్ని ఒంపావు

RTS Perm Link

వర్గములు: కలగూరగంప

2 అభిప్రాయాలు

spandana యొక్క అభిప్రాయము

Made Friday, 28 of July , 2006 at 5:24 am

చాలా బాగుంది.

– ప్రసాద్
http://charasala.wordpress.com

swetharamachandra యొక్క అభిప్రాయము

Made Saturday, 28 of October , 2006 at 6:30 am

మీకవి హ్రుదయానికి జోహార్లు.మీబ్లాగులోని కవితలన్నీ చదివాను.ప్రతీది అద్బుతంగా ఉంది.

అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

My Photoపేరు: శ్రీనివాసరాజు దాట్ల వృత్తి: 'పోకిరి' సినిమాలో బ్రహ్మానందం చేస్తాడే అది :) స్వస్థలం: వైశాఖపట్టణం నివాసం: సౌభాగ్యనగరం

చైత్రం నాది, శిశిరం నాది, వెలుగు నాది, చీకటి నాది, కష్టం నాది, సుఖం నాది, నవ్వు నాది, ఏడుపు నాది, అచ్చ తెలుగులో ప్రతి అనుభూతీ నాది.