LIC యాజమన్యానికి ఒక లేఖ

రాసినవారు శ్రీనివాస on Friday, 28 of July , 2006 at 11:33 pm

గౌరవనీయులైన LIC యాజమాన్యానికి ఓ సగటు భారత పౌరుడు అందునా ఆంద్రుడు విపత్కర పరిస్థితులలో
మనస్కరించి వినమ్రతతో నమస్కరించి వ్రాయునది ఏమనగా…

అయ్యా, గత కొన్ని దశాబ్ధాలుగా నాలాంటి మద్యతరగతి వాళ్ళకి ఉపయోగయోగపడుతూ వస్తున్న మీ జీవిత భీమా పాలసీలలో మార్పులు చేర్పులు చేయవలసిన సమయం వచ్చిందని భావిస్తున్నాను. కొన్ని సంవత్సరాలుగా లోకంలో జరిగిన మార్పులకు ఫలితంగా జరిగిన పరిణామాలను విశిదీకరించి కొన్ని విషయాలను మీ పాలసీలలో అదనంగా చేర్చమని కోరుతున్నాము. ఈ క్రింద చేర్చబోయేవాటిని కూడా స్వప్రమేయం లేని ప్రమాదాలుగా భావించాలని నా మనవి.

- మహానగర వీధులలో మేన్‌హోల్స్.

- ట్రాఫిక్ పోలీసుల వికృత చేష్టలు

- లాకప్‌డెత్‌లు

- ప్రభుత్వ ఆసుపత్రులలో బాద్యతలేని వాళ్ళు



దయచేసి వీటిని చేర్చిన కొత్త పాలసీని ఎంత తొందరగా ప్రకటిస్తే అంత శ్రేయష్కరం. అసలే ఇది వర్షాకాలం కూడాను!

గమనిక: ప్రైవేటు భీమా సంస్థలకు కూడా ఇటువంటి లేఖలనే పంపుతున్నామని తెలుసుకోగలరు.

RTS Perm Link

వర్గములు: కలగూరగంప

1 అభిప్రాయము

cbrao యొక్క అభిప్రాయము

Made Saturday, 29 of July , 2006 at 4:39 am

Add bomb blasts, dacoities in train and hand grenade attacks in Kashmir.

అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

My Photoపేరు: శ్రీనివాసరాజు దాట్ల వృత్తి: 'పోకిరి' సినిమాలో బ్రహ్మానందం చేస్తాడే అది :) స్వస్థలం: వైశాఖపట్టణం నివాసం: సౌభాగ్యనగరం

చైత్రం నాది, శిశిరం నాది, వెలుగు నాది, చీకటి నాది, కష్టం నాది, సుఖం నాది, నవ్వు నాది, ఏడుపు నాది, అచ్చ తెలుగులో ప్రతి అనుభూతీ నాది.