ఎప్పుడో ఈ కథని ద హిందూ వారి సప్లిమెంట్ అయిన యంగ్ వరల్డ్ లో చదివాను. దీనిని దేవుడిని ఉద్దేశ్యంగా తీసుకుని కాకుండా నమ్మకాన్ని ఉద్దేశ్యంగా అనుకుని చదవండి.

ఒకసారి ఓ పర్వతారోహకుడు ఓ మంచు శిఖరాన్ని తాడు ఆధారంతో ఎక్కుతున్నాడు. అప్పటికే సాయంత్రమవడంతో చలి బాగా పెరిగింది. ఎలాగైనా అక్కడున్న హిమరహిత ప్రదేశాన్ని చేరుకోవాలని గబగబా పైకి వెళుతున్నాడు. రాత్రి ముసురుకోవడంతో కన్ను కానరాక అదుపుతప్పి క్రిందకి జారిపోసాగాడు. కొంతసేపటికి గాలిలో వేళాడుతున్న అనుభూతి… ఆ చీకటిలో ఎక్కడ ఉన్నాడో తెలియని అయోమయం… కనీసం నేల మీద ఉన్నా రాత్రిపూట ఎక్కడికన్నా వెళ్ళి తలదాచుకోవచ్చు… ఇలా దొరికిపొయాను అని అనుకుంటూ ఏమి చేయాలో తెలియక ‘భగవంతుడా! నువ్వే నాకు దిక్కు; ఎలాగైనా నన్ను కాపాడు.’ అంటూ దేవుడిని వేడుకున్నాడు. వెంటనే ‘నీ దగ్గర ఉన్న కత్తితో నువ్వు వేళాడుతున్న తాడుని కోసేస్తే నువ్వు విముక్తుడివి అవుతావు’ అంటూ అతడికి ఆకాశవాణి వినిపించిది.దానికి అతడు భయంతో ‘అలా చేస్తే నేను కిందకి పడి చచ్చిపోతాను’ అంటూ దేవుడిని నిందించసాగాడు.చలికి తట్టుకొలేక గడ్డకట్టుకుపొయాడు.

మర్నాడు అక్కడకు వచ్చిన కొంతమందికి నేలకు ఓ పది అడుగుల ఎత్తులో వేళాడుతున్న ఆ పర్వతారోహకుడి శవం కనిపించింది.

RTS Perm Link