నమ్మకం

రాసినవారు శ్రీనివాస on Monday, 31 of July , 2006 at 9:34 pm

ఎప్పుడో ఈ కథని ద హిందూ వారి సప్లిమెంట్ అయిన యంగ్ వరల్డ్ లో చదివాను. దీనిని దేవుడిని ఉద్దేశ్యంగా తీసుకుని కాకుండా నమ్మకాన్ని ఉద్దేశ్యంగా అనుకుని చదవండి.


ఒకసారి ఓ పర్వతారోహకుడు ఓ మంచు శిఖరాన్ని తాడు ఆధారంతో ఎక్కుతున్నాడు. అప్పటికే సాయంత్రమవడంతో చలి బాగా పెరిగింది. ఎలాగైనా అక్కడున్న హిమరహిత ప్రదేశాన్ని చేరుకోవాలని గబగబా పైకి వెళుతున్నాడు. రాత్రి ముసురుకోవడంతో కన్ను కానరాక అదుపుతప్పి క్రిందకి జారిపోసాగాడు. కొంతసేపటికి గాలిలో వేళాడుతున్న అనుభూతి… ఆ చీకటిలో ఎక్కడ ఉన్నాడో తెలియని అయోమయం… కనీసం నేల మీద ఉన్నా రాత్రిపూట ఎక్కడికన్నా వెళ్ళి తలదాచుకోవచ్చు… ఇలా దొరికిపొయాను అని అనుకుంటూ ఏమి చేయాలో తెలియక ‘భగవంతుడా! నువ్వే నాకు దిక్కు; ఎలాగైనా నన్ను కాపాడు.’ అంటూ దేవుడిని వేడుకున్నాడు. వెంటనే ‘నీ దగ్గర ఉన్న కత్తితో నువ్వు వేళాడుతున్న తాడుని కోసేస్తే నువ్వు విముక్తుడివి అవుతావు’ అంటూ అతడికి ఆకాశవాణి వినిపించిది.దానికి అతడు భయంతో ‘అలా చేస్తే నేను కిందకి పడి చచ్చిపోతాను’ అంటూ దేవుడిని నిందించసాగాడు.చలికి తట్టుకొలేక గడ్డకట్టుకుపొయాడు.


మర్నాడు అక్కడకు వచ్చిన కొంతమందికి నేలకు ఓ పది అడుగుల ఎత్తులో వేళాడుతున్న ఆ పర్వతారోహకుడి శవం కనిపించింది.

RTS Perm Link

వర్గములు: కలగూరగంప

5 అభిప్రాయాలు

spandana యొక్క అభిప్రాయము

Made Tuesday, 1 of August , 2006 at 6:12 am

స్రీనివాస్ గారూ, ఈ కథలో నీతి ఏమిటో నాకు అర్థం కాలేదు. చీకట్లో కింద భూమి ఎంత దిగువున వుందో తెలియకుండా దూకాలనుకోవడం తక్షణ ఆత్మహత్యే కదా? కనీసం అలానే వేలాడుతూవుంటే ఇంకొన్ని ఎక్కువ క్షణాలు బతకవచ్చు, ఆ ఎక్కువ క్షణాలలో ఏదో అద్భుతం జరిగి బతకనూవచ్చు. అతి ఎక్కువ సమయం ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలే గానీ లోతు తెలియని బావిలోకి గుడ్డిగా దూకడం ఎలా విచక్షణ అనిపించుకొంటుంది? ఈ కథలో పది అడుగులే వుందని తెలియక వేలాడుతూ మరణించడం తన తెలివితక్కువతనం వల్ల కాక తన దురదృష్టం వల్ల అని నా అభిప్రాయం.
– ప్రసాద్
http://charasala.wordpress.com

శ్రీనివాస యొక్క అభిప్రాయము

Made Tuesday, 1 of August , 2006 at 11:46 pm

ధన్యవాదములు ప్రసాద్ గారూ.అతడు దేవుడిని పూజిస్తున్నాడు గానీ పూర్తి నమ్మకంతో కాదు. ఆ విషయమే ఇక్కడ ఆలోచించవలసినది.

మురళీ కృష్ణ యొక్క అభిప్రాయము

Made Wednesday, 2 of August , 2006 at 2:43 am

అవునండీ శ్రీనివాస్ గారూ. అంత నమ్మకం లేనివాడు దేవుడా నువ్వే దిక్కని ఎందుకనడం?

శ్రీనివాస యొక్క అభిప్రాయము

Made Wednesday, 2 of August , 2006 at 2:57 am

మురళీ గారూ, అదే కదా విషయం ఇక్కడ. లోకంలో చాలా మంది ఉంటారు ఇలా. బహుశా నేను కూడా అలాగే ప్రవర్తిస్తానేమో ఆ ప్రాణాపాయ స్థితిలో… :)

spandana యొక్క అభిప్రాయము

Made Wednesday, 2 of August , 2006 at 7:51 am

ధన్యవాదములు. ఇప్పుడు అర్థమయ్యింది. నమ్మితే పూర్తిగా నమ్మాలి అంటుందీ కథ. కానీ నాకెందుకో ఇది సరైంది అనిపించటం లేదు, క్షమించండి. నమ్మకం వుంచాలి గానీ దాన్ని పునర్విమర్ష చేసుకుంటూ నమ్మదగిందా కాదా అన్నది ఎవరికివారు ఆలోచించాలి అనుకుంటాను. కానీ దేవుడు లేదా తన మీద తను నమ్మకం మాత్రం సందిగ్దానికి తావు లేకుండా వుంచుకోవాలి. మహిమ దేవుడ్లో లేదు తనెంత గాఢంగా నమ్ముతున్నాడు అనేదాంట్లో వుంది.
– ప్రసాద్
http://charasala.wordpress.com

అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

My Photoపేరు: శ్రీనివాసరాజు దాట్ల వృత్తి: 'పోకిరి' సినిమాలో బ్రహ్మానందం చేస్తాడే అది :) స్వస్థలం: వైశాఖపట్టణం నివాసం: సౌభాగ్యనగరం

చైత్రం నాది, శిశిరం నాది, వెలుగు నాది, చీకటి నాది, కష్టం నాది, సుఖం నాది, నవ్వు నాది, ఏడుపు నాది, అచ్చ తెలుగులో ప్రతి అనుభూతీ నాది.