ఎన్ని వేల వర్ణాలో…

Archive for July, 2006


ఓ ఆత్మఘోష

Jul 27, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
నేనొక ఆత్మని – తలచి తలచి వగచి వగచే జీవాత్మని
పసితనాన్ని నుసిచేసిన గతమెంత గగుర్పాటో కదా!
వీడని నీడలా చీడలా పీడలా ఇంకా వెంటాడుతూనే ఉంది.
చదువుకోని తల్లిదండ్రులు; చదువు చెప్పలేని బడిపంతుళ్ళూ
ఆటనేర్పలేని బాల్యమిత్రులు; మాట చాటలేని స్వీయలోపాలు
వెరసి గాలికి రెపెరెపెలాడుతూ వెలగలేక వెలిగిన కొవ్వొత్తయిపోయింది.
వాడిని వేడిని పరిగెత్తే నాడిని పట్టుకుని యవ్వనమొచ్చింది
కన్ను కాంచినదే అందం కాదని తెలుసుకోలేక
మనసుని ఆపలేక – ప్రేమించడం చేతగాక
వజ్రమంటి తళుకున్న మనిషిని; దానిలాగే కఠోరమైన మనసుని వలచి –
తైలం లేని బండి ఎలా నడవదో, పైకం లేని ప్రేమ అలా నిలవదని
అనుభవమయ్యేసరికి అంతా జరిగిపోయింది –
చెదిరిన కలలే కంటికి మిగిలాయి; విరిగిన మనసే తనువుకి మిగిలింది
మనకిలాగే రాసుందని సరిపెట్టుకున్నాకా…
బ్రతుకుతెరువుకి చిన్న ఉద్యోగాన్ని వెతికి పట్టుకున్నాకా…
‘నువ్వొక్కడివే ఏం మోస్తావ్ – ఈమెకూ పంచిపెట్టు’ అంటూ వేదమంత్రాల సాక్షిగా –
ఆమెనిచ్చి నాకు పెళ్ళి చేసారు; ఆమె జీవితాన్ని బుగ్గిచేసారు.
పీటలమీద కట్టిన తాళి తప్ప మరెప్పుడూ ఆమెకు సువర్ణయోగం కలగలేదు
పాపం పెరట్లో పూచిన మల్లెలే అప్పుడప్పుడూ అలంకారమయ్యేవి
పొదుపుకి అందనంత; కడుపులు నిండినంత సంపాదన నాది;
అందుకే చేదు అనుభవాలను మాత్రమే దాచుకోగలిగాను.
పుట్టిన పిల్లలు పువ్వులై తావులు వెదజల్లుతారనుకున్నానే గానీ
రెక్కలు కదిపే వయసొచ్చాకా దిక్కులకు ఎగిరిపోతారనుకోలేదు –
తోడుగా మిగిలిన ఆలి జాలిగా చూసేదప్పుడప్పుడు…
తలపండలేదు నడుమొంగలేదు కానీ –
అప్పటిదాకా గుండెల్లో గింగిరాలు తిరిగిన పొగ,
కడుపులోకి వెచ్చగా చేరిన సారా
అదనుచూసి కాచుకున్న బందిపోట్లలా కత్తిదూసాయి
అణువణువునూ కసిగా కోయసాగాయి.
నా ఇల్లాలు ఏనాడు చేసుకున్న పుణ్యమోగానీ
సౌభాగ్యవతిగానే వెళ్ళిపోయింది; నన్నేకాకిని చేసింది.
చివరికి – చివరి నిమిషంలో తులసితీర్థం అందలేనంత దౌర్భాగ్యుడినయ్యాను.
అయ్యో! దేవుడి గుళ్ళోకైనా, చెలియ జళ్ళోకైనా, కనీసం సమాధి మీదకైనా చేరలేని
కొమ్మకే వాడిపోయి రాలిపోయిన పువ్వునయ్యాను.
కాటికెళ్ళేటప్పుడు కన్నీరుపెట్టేవారు లేకపోయారు
చితి కాలుతున్నప్పుడు కట్టె కదిపేవారూ లేకపోయారు.
అలా రూపులేని రేపులేని ఆత్మనయ్యాను
గతజన్మ వాసనలు ఎంతకీ పోక – మరుజన్మ ఎంతకీ రాక
యుగయుగాల నిరీక్షణకు అద్దంపట్టే ఈ చెట్టు పైకి చేరాను

RTS Perm Link

వాన

Jul 26, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
రాత్రంతా ఒకటే వర్షం
నింగేమో నేలతో సరసం
చినుకులతో చుంబనం; మెరుపులతో ఆలింగనం
గగన మోహమంతా మేఘ సందోహమై కరిగెనే చల్లగా
పుడమి దాహమంతా ఆ స్పర్శతో తీరెనే వెచ్చగా

RTS Perm Link

తియ్యగా పలుకవా

Jul 24, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
————- శ్రీనివాస స్వీయ రచన ————-
తియ్యగా పలుకవా చిగురించిన స్నేహమా
హాయిగా నవ్వవా నా చల్లని నేస్తమా
నా రుధిరంలో సుధలు చిలుకు రాగమా
ప్రతి ఉదయంలో మేలుకొలుపు గీతమా
నువు ఎక్కడ ఉన్నా నన్ను అనుక్షణం ముందుకు నడిపే ఓ బందమా
ఈ లోకము అంతా నను వీడిపోతుంటే తోడుగ నిలిచేది నీవే కదా
గ్రీష్మాలు శిశిరాలు నా వెంట పడుతుంటే చైత్రమై నిలిచేది నీవేకదా
నా పెదవి పైన చిరునవ్వు విచ్చిందో సంతోషమొందేది నీవే కదా
చిగుతరాకు చీరలలో అలరారు ఆమనిలో పూచిన పూరేకువు నీవు
హేమంత దారులలో తెలిమంచు దుప్పటిలో తాకిన నీరెండవు నీవు
మిత్రమా… మిత్రమా… జీవన సౌరభాలు గుభాళించు కుసుమమా
మిత్రమా… మిత్రమా… వెన్నెల వాగులలో జలకమాడు నేత్రమా

RTS Perm Link

మరణమంటే…

Jul 23, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
————- శ్రీనివాస స్వీయ రచన ————-
మరణమంటే జననం; మరుజన్మకు పయనం
తీరిపోని రుణాలకు వగచి వగచి
తీరలేని కోరికలను తలచి తలచి
ఏ తండ్రి అంశువుతో ఏ తల్లి గర్భంలో ఏవేల నవమాస తపము మొదలౌనోనని ఎదురుచూసే ఫ్రాణం

RTS Perm Link

RTS Mirror Widget


from JalleDa

పంచాంగం


Warning: fsockopen(): php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: fsockopen(): unable to connect to udp://whois.happyarts.net:8000 (php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known) in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: stream_set_timeout() expects parameter 1 to be resource, boolean given in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 125