————- శ్రీనివాస స్వీయ రచన ————-
నవ్వుకున్నాము నిన్నా మొన్నా, నవ్వుకుందాము ఈ రోజంతా,
నవ్వుతూనే ఉందాము మునుముందు…
ఏకమౌదాము చిన్నా పెద్దా, సాగిపోదాము నవ్వుల నదిలా,
నింగీ నేలకు ఔదామా కనువిందు…
పువ్వులనే మురిపించేలా, పువ్వులనే మరిపించేలా , మనసంతా వికసించేలా నవ్వేద్దాం …
గువ్వల కిలకిలలు శృతులుగా నవ్వేద్దాం…
మువ్వల చెవులకు చిల్లులు పడేలా నవ్వేద్దాం…
కష్టాలు అన్ని మన దారినొదిలి పారిపోయేలా నవ్వేద్దాం…
కన్నీళ్ళు కూడ సంతోషంతో చెంపల్ని తడిమేలా నవ్వేద్దాం…
ఎద నొచ్చినా దిగులు లేక నవ్వుతూ చిందులేద్దాం…
యముడొచ్చినా బాద పడక నవ్వుతూ పలకరిద్దాం…
ఈ లోకాన్ని వీడే క్షణంలోనూ నవ్వుతూ వెళ్ళిపోదాం.

RTS Perm Link