పాపం సర్దార్జీ…
Aug 2, 2006
Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
ఈ విషయం ఇక్కడ రాయకూడదనుకున్నాను కానీ తప్పలేదు. గత కొన్ని నెలలుగా ఈమెయిల్స్‌లో గానీ ఏవైనా సైట్స్‌లో గానీ సర్దార్జీల మీద జోక్స్ ఎక్కువైపోతున్నయి.ఇవి చదివి నవ్వుకోడానికి బాగానే ఉంటాయి.కాని మనం నవ్వుకోవడానికి ఒక జాతిని ఉదహరించడం మంచిదికాదేమో! బుష్ కయ్యానికి కాలు దువ్వాడని అమెరికా వాళ్ళను నిందించడం, లాడెన్ మతమౌడ్యానికి ముస్లింలని తప్పుపట్టడం తప్పు కదూ. నాకు ఇలాంటి జోక్స్ మెయిల్స్‌లో వస్తుంటాయి. కానీ ఎవరికీ ఫార్వార్డ్ చెయ్యను. ఒక వేళ మీకెవరికైనా ఇలాంటివి వస్తుంటే ఏ శీనయ్యొ దానయ్యో అని పేర్లు మార్చి పంపించండి. సర్వేజనా సుఖినోభవంతు:
RTS Perm Link
4 Responses for "పాపం సర్దార్జీ…"
శ్రీనివాస్ గారూ,
నాకూ ఇదే బాధ ఎప్పట్నుంచో వుంది. నేనూ వీటిని ప్రోత్సహించటం లేదు. అమెరిక్న్లను, ముస్లింలను నిందించడానికి ఓ సాకు వుంటే, ఈ సర్దార్జీ జోకులకు నాకేమీ మూలం కనిపించటం లేదు. సాహసవంతులు, అందగాళ్ళు, అలిష్టులు వాళ్ళు. వాళ్ళకు మల్లే దృడకాయులు మన తెలుగు దేశంలో కనిపించడం చాలా అరుదు. దేశ విభజనలో ఎక్కువగా నష్టపోయింది వాళ్ళే, తీవ్రవాదం, ఆ తర్వాత అల్లర్లలోనూ బాగా నష్టపోయారు. పూర్వము హిందూ కుటుంబాలలో పెద్ద కొదుకును సిక్కును చేస్తామని మొక్కుకునేవారట. ఈ సిక్కులైనా, జైనులైనా, బారతీయ ముస్లిములైనా అందరూ ఒకే మూల రక్తం నుంచీ వచ్చిన వారు కదా, మరి సర్దార్జీలమీదనే జోకులెందుకే అర్థం కాదు. నవ్వుకోవాలంటే ఏ రముడో, సోముడో అని చెప్పుకోవచ్చు గదా!
– ప్రసాద్
http://charasala.wordpress.com
శ్రీనివాస్ గారూ, చిత్రంగా నావి కూడా ఇంచుమించు ఇవే ఆలోచనలు. మీ సూచన బాగుంది. తప్పక అందరూ పాటిస్తే చాలా బాగుంటుంది.
– కామేశ్వర రావు
http://chittellas.blogspot.com/
U R RIGHT
ఇది ఎలా మొదలైందో తెలియదు కాని ఈమద్య కాలంలో బాగా స్ప్రెడ్ అయింది.మీసలహా బాగుంది.తప్పకుండా పాటిస్తాను.
బహుశా మీరు ఎవరు పంజాబ్ ఎప్పుడు వెళ్ళినట్లు లేదు అందుకే సర్దార్ల గురించి తెలియదు
Leave a reply