తుహిన తల్పం
రాసినవారు శ్రీనివాస on Thursday, 17 of August , 2006 at 8:57 pm

రాతిరంతా స్వప్నలోకంలో తిరుగుతుంటాను…
దూరమెళ్ళిన నేస్తమో దగ్గరైన బందమో ఎవరో గానీ నన్ను చేరి దారి పొడవున తోడు వస్తారు…
హాయి పూలను ఏరుకుంటూ గుండె గంపను నింపుకుంటూ రేయి ముగిసే వేళలోన కలలసంద్రపుటొడ్డుకి చేరుకుంటాను…
అంతదాకా చెంతనున్న వారు కాస్త నన్ను వీడి వెళ్ళిపోతారు…
గంపనేమో నేల దించి తడి తడిమిన ఇసుకమీద దాచుకున్న పూలతో అనుభూతుల ముగ్గులేసి మురిసిపోతాను…
ఏ దుష్ట హస్తమో మరే వికృత వాలమో తెగిపడ్డ అలలాగ కవ్విస్తూ కబళించి వెళ్ళిపోతుంది…
నా కలలను చెరిపేసి నన్నేమో వేకువ ముంగిట వదిలేసి మాయమౌతుంది…
- శ్రీనివాస స్వీయరచన

వర్గములు: కలగూరగంప
- ఈ టపాను వీటికి జతచేయండి
- Del.icio.us -
- Meneame -
- Digg
3 అభిప్రాయాలు
spandana యొక్క అభిప్రాయము
Made Friday, 18 of August , 2006 at 6:26 am
మీ స్వప్నాలను అద్భుతంగా ఆవిష్కరించారు.
ఇంతకీ “తుహిన” అంటే ఏమిటి?
– ప్రసాద్
http://charasala.wordpress.com
శ్రీనివాస యొక్క అభిప్రాయము
Made Friday, 18 of August , 2006 at 10:27 pm
ధన్యవాదములు ప్రసాద్ గారు. తుహినమంటే హిమము అని అర్థం.
శ్రీనివాసరాజు యొక్క అభిప్రాయము
Made Saturday, 19 of August , 2006 at 6:40 am
అబ్బా!!.. ఏంరాసారు.. నాకు మీ రచనలలో అన్నిటికంటే ఇది నా ప్రియమైన రచన..
అభిప్రాయాన్ని తెలియజెయ్యండి
పేరు: శ్రీనివాసరాజు దాట్ల వృత్తి: 'పోకిరి' సినిమాలో బ్రహ్మానందం చేస్తాడే అది :) స్వస్థలం: వైశాఖపట్టణం నివాసం: సౌభాగ్యనగరం