
నన్ను బ్రతికిస్తున్నది ఎవరు? నన్ను నడిపిస్తున్నది ఎవరు? ఆ భగవంతుడి దీవెనలా ; నా తండ్రి అనురాగమా; నా తల్లి మమకారమా; నా స్నేహితుల అభిమానమా! ఏమో నాకివేమీ తెలియవు అప్పటి వరకు. నాలోని నాతో ఎప్పుడూ తర్జన భర్జనలే. నేను ఒకటి మంచిగా తలిస్తే వాడు చెడు అంటూ వెనుకాడతాడు; అదే నా మనసు కీడు ఉందని వెనుకాడుతుంటే వాడు మేలు ఉందని ముందుకు తోస్తుంటాడు. అనునిత్యం పెద్ద చిక్కొచ్చింది వాడితో. ఇక తట్టుకోలేక పోయాను. ఒక నిర్ణయానికి వచ్చాను. ఓ ప్రభాత వేళ వాడి కన్నా ముందే నేను మేల్కొన్నాను. వాడు గాఢ నిద్రలో ఉన్నాడు; బహుశా నాతో కలలో గొడవపడుతున్నట్టున్నాడు. వాడు లేవక ముందే ఏదో ఒకటి చెయ్యాలి అని ఆ ముందురోజు రాత్రే నిర్ణయించుకున్నాను. నాలో ధైర్యాన్ని మొత్తం కూడగట్టాను. నాలోని దృడ నిశ్చయాన్ని కత్తిగా మలచుకున్నాను. అంతే మనసారా కసాకసా నరికి పాడేసాను నాలోని వాడిని. రక్తం చిందించకుండా వాడిని పరలోకానికి పంపించేసాను.
అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. నాకప్పుడు లోకం అంతా కొత్తగా కనిపించసాగింది. అందరూ నవ్వుతూ పలకరిస్తున్నారు. నా జీవితమెందుకో నాకర్దమైంది. అమావాస్య రాతిరిలో కూడా వెలుగుని కాంచే చిత్తం నా వశమైంది.నా ప్రశ్నలకు జవాబు దొరికింది. నన్ను ముందుకు నడిపించేది నా ఆశయమని… రేపటి దారుల వైపు ఆశతో పయనం సాగించాలని… పక్కవాడితో కాకుండా నాతో నేనే పోటీ పడాలని… ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పాలంటే! ఈ జవాబులకి ప్రతిరూపాలేనేమో ఆ భగవంతుడి దీవెనలు; నా తండ్రి మమకారం; నా తల్లి అనురాగం; నా స్నేహితుల అభిమానం.
- శ్రీనివాస స్వీయరచన
RTS Perm Link
11 Responses for "నాలో నేను"
చాలా బాగుంది శ్రీనివాసగారూ!
విశ్వ సుందరిగా గెలుపొందినప్పుడు హూ పేరు మర్చిపోయాను. అడేనండి ఐశ్వర్యారాయ్ తో పాటు గెలిచినామె! ఆమె అన్నారు.. జీవితమంటే ఒక ఆశయాన్ని సాధించడం కాదు ఆశయాల్ని నిర్దేశించుకుంటూ ఒకదాని తర్వాత ఇంకోటి సాధించుకుంటూ వెళ్ళడమేనని!
– ప్రసాద్
http://charasala.wordpress.com
స్రీనివాస గారూ, మీ సందేహానికి నా జవాబుకై నా బ్లాగు పోస్టు “డబ్బు డబ్బు” చూడండి.
– ప్రసాద్
http://charasala.wordpress.com
good one… and nice sketch
chala bagundandi.chivariki naalane velugunu chudagaligaru.
konchem font size penchite chadavadaaniki veeluga vuntundani na vuddesyam.
చక్కగా కనుక్కున్నారు. నా అభినందనలు.
chala baga rasaru …. sketch bagundi,,,,
its really good impression… okka vidamuga manalani manamu correct way lo petu kodaniki………….
తొలిప్రేమ
చల్లగా వీస్తున్న చిరుగాలి…పలుకరిస్తున్న చిరు ఝల్లు
దొబుచులాడుతున్న జాబిలి నను ఆహ్లదపరుచగా…
నీ మోమున చిరునవ్వు నీ ఓరకంటి చూపు
నా మనసుని తాకి నీ ప్రేమను ప్రేమగా తెలుపగా
నా ఆనందం వెల్లి విరిసి…నా మోమున చిరునవ్వై
నా బుగ్గలు ఎరుపెక్కి…తోలి సిగ్గై మెరిసి
గమనించని ప్రకృతికి చెప్పకనే చెప్పెనులే…
చిగురించిన మన ప్రేమ….పులకింతల తొలిప్రేమ….
————————————————– ఉదయ
its really nice
మోక్షం అనగా ఏమిటి?
నిద్రలో ఏమౌతుందో గ్రహిస్తున్నారా ఆత్మలోఎరుకతో తెలుసుకోండి నిద్రలో ఆత్మలేదు తెలియనివెన్నో జరుగుతుంటాయి ఆత్మ చైతన్యం అనేది ఎక్కడో దూరంగా ఉండే విషయం కాదు,అది ఆత్మ చైతన్యం లో ఉంది..ఆత్మ చైతన్యం ఆవరించుకుని ఉన్నట్లుగానే , సత్యం మన చుట్టు ఆవరించుకుని ఉంది.ప్రతిబంధకం మనస్సే. మిమ్మల్ని మాయాతెరలాగ చుట్టుముట్టి భౌతిక ప్రపంచ అందాలకు మిమ్మల్ని పరవశ్యులను చేస్తుంది.
ఆ మనస్సు మాయలో లీనమైపోయి సత్యాన్ని మర్చిపోతున్నారు. నిరంతరం కలలు గనేది, కల్పనలు,ఆశలు,ఆశయాలు,కోరికలే ఆలోచించేదే మనస్సు. నిజానికి లేనిదల్లా మనస్సే. కాబట్టి దేవుడ్ని తెలుసుకోనివ్వకుండా ప్రతిబంధకం అంతా మనస్సే. బొధిచిత్తం లేదా బుద్ద చైతన్యం అంటే మనస్సును ఖాళిగా ఉంచడం.అంటే ఆలోచనలు ఏమిలేని ఈ స్థితి మోక్షం మనస్సు అని అర్థం.అన్ని మతాల సారాంశం అంతా ఈ స్థితికోసమే. ఈ స్థితి సాధించడమే దేవుడ్ని తెలుసుకునే మహాద్వారం.
మనస్సు, నిలిపి, ముక్తికి మార్గం
మనస్సు మిక్కిలి చంచల స్వభావమైనది. సర్వకాల సర్వావస్థల యందును ఏదో ఒక విషయంపై చింతిస్తునే ఉంటుంది. ఒక క్షణకాలమైనా విశ్రాంతిగా ఉండదు. ఒక విషయం నుండి మరియొక విషయానికి అత్యంత వేగంగా మారిపోతుంటుంది. అందువల్లనే లోకంలో మనో వేగానికి మించింది మరొకటి లేదని పెద్దలంటారు. ఇటువంటి ‘మనస్సు’ను యథేచ్ఛగా విడిచినట్లయితే ఇంద్రియాలకు ఆధీనమై, కామక్రోధాదులను బలపరచి అహంకార మమకారాలను పెంచి, మనలను పాపపు త్రోవలో నడిపించి అధోగతి పాలు చేస్తుంది. మనస్సు, నిలిపి, ముక్తికి మార్గం
మనలో కొంత మంది వివిధ పేర్లతో ఉన్న దేవుళ్లను పూజిస్తారు. కొంత మంది రాముని, మరి కొంత మంది కృష్ణుని, అల్లా, క్రీస్తు, దేవీలను పూజిస్తారు. అయితే కంటికి కన్పించే దేవుళ్లలో గురువు కూడా ఒకరని తెలుసుకోవాలి
గురువులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. త్రేతా యుగంలో శ్రీరాముడు కుల గురువైన వశిష్ఠుల వారి వద్ద విద్యనభ్యశించాడు. అంతే గాక విశ్వామిత్రుడు తదితర గురువుల వద్ద విద్యాభ్యాసం చేసి శక్తులను నేర్చుకున్నాడు.
గురువు వద్ద శిష్యరికానికి చేరుతారు. శిష్యుని శ్రేయస్సు కోరడం ద్వారా గురువు పాత్ర పరిపూర్ణమవుతోంది. పుణ్యతీర్థాల దర్శనం ద్వారా లభించేని పుణ్యాన్ని మంచి గురువు వద్ద చేరి, ఆయన ప్రవచనాలను వినడంతో పొందవచ్చని వేద పురాణాలలో చెప్పబడింది. గురువు వద్ద శ్రద్ధాశక్తులతో విద్య నేర్చుకునే వారు ఖచ్చితంగా జీవితంలో పైకెదుగుతారన్న విషయాన్ని పలువురి మేధావుల జీవితాల నుంచి కూడా తెలుసుకోవచ్చు.
మనస్సు, నిలిపి,మనో నిగ్రహ లక్షణాంతాః అన్నాడు. అంటే సర్వ వ్యవస్థలయందును, సర్వకాలముల యందును మనస్సునిలిపి నిగ్రహించుకొనుట అనే లక్షణం ఉత్తమమైనది. ముక్తికి మార్గం సూక్ష్మ చైతన్య సాధన మనస్సు నిలిపి, నిర్మలంగా, నిశ్చలంగా ఉండడం అత్యంతవసరం. స్థూల శరీరంలో మనస్సు ఒక సూక్ష్మమైన భాగం. ఈ భౌతికమైన స్థూల శరీరం మనస్సుకు పైన ఉండే ఒక పొర మాత్రమే. మనస్సు శరీరంలోని ఒక సూక్ష్మమైన అంశం కావున ఇవి రెండూ ఒకదానికొకటి ప్రభావం చెయ్యగలవు. ఈ కారణం వల్లనే శరీరానికి కలిగిన అనారోగ్యం మనస్సును, మనస్సుకు కలిగిన అనారోగ్యం లేక వత్తిడి శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. సరియైన పద్ధతిలో ‘మనో నిగ్రహాన్ని’ సాధించగల్గితే అదే మన పాలిట దివ్య శక్తియై, ఆ భగవత్స్వరూపమైన మనలోని సత్య, శౌచ, దయాది మంచి గుణములను పెంచి, భక్తి, జ్ఞాన వైరాగ్య భావాల్ని కల్గించి మనల్ని దివ్యమైన ఆత్మజ్ఞానమార్గములో పయనింపచేసి, శాశ్వతమైన ముక్తిని ప్రసాదిస్తుంది.
Leave a reply