ఎన్ని వేల వర్ణాలో…

Archive for August, 2006


ఓ యువరాజు మనోగతం

Aug 23, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
నేనే రాజును… యువరాజును…
తాతకుండక రాజ్యము… తండ్రికొసగక భాగ్యము… తల్లి మరిచెను సౌఖ్యము…
ఇంట మిగిలెను పాత మకుటము… పదును పోయిన ఖడ్గము… పరుగుతీయని అశ్వము…
నన్ను చదివింపనెంచిన నా తండ్రికొచ్చెను కష్టము…
మా బాగోగులు చూడడానికే గడిచిపోయెను తల్లి జీవితం…
బడికి పంపగ నన్ను పాపం హారతాయెను తండ్రి జీతము…
కళాశాలలో నన్ను చేర్చగ ఇల్లు మారెను ఖడ్గము…

పట్టభద్రుడినవ్వగా మరి కరిగిపోయెను మకుటము…

మాకు భారము ఎందుకంటూ మట్టినొదిగెను అశ్వము…

పదిలమ్ముగా దాచుకోగా చివరికి మిగిలెనే ఈ కలం…

అమ్మనాన్నల ఆశ తీరే క్షణమెప్పుడో… ఇంకెప్పుడో…

వాళ్ళ ఋణమును తీర్చుకునే తరుణం ఇంకెన్నడో…

– శ్రీనివాస స్వీయరచన

RTS Perm Link

నిజ సౌందర్యం

Aug 17, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప

ఓ ప్రియా! నువ్వెవరో నాకు తెలియదు. ఎప్పుడో కంటి ముందు కదిలిన నీ రూపు ఇంకా అస్ఫష్టమే!
కానీ స్వప్నసీమలలో నన్ను తాకిన నీ అలౌకిక స్పర్శ నాకు సుపరిచితమే…
ఇప్పుడేమి జరిగిందో తెలుసునా…
నీ తలపుల రథం నన్నో పూలతోట ముందుకు చేర్చింది నిన్ను చూపిస్తానంటూ…
నేను వడివడిగా ఆ వనద్వారం దాటుకుంటూ లోనికి వెళ్ళిపోయాను…
అబ్బో! ఎక్కడ చూసినా రంగు రంగుల పూలు; అందమైన పూలు. ఏ పువ్వులో నువ్వు దాగున్నావో తెలియదు…
ఆత్రంగా ఒక్కో పువ్వునూ తాకుతున్నాను… అమ్మో! ప్రతీ పువ్వుకీ కనిపించని ముళ్ళు…
ఆ తోట అంతా తడిమి చూసేసరికి నా కళ్ళు అలసిపోయాయి… నా చేతులు రక్తమయమైపోయాయి… కానీ ఏదీ నిన్నటి ఆ అలౌకిక స్పర్శ…
నిస్తేజుడనై, నిర్వేదుడనై వనం బయటకి చేరుకున్నాను…
అడుగులు తడబడుతూ నడుస్తున్న నాకు ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది…
అహా! అదే స్పర్శ అదే అనుభూతి కదా నువ్వు నిన్న కనుకగా ఇచ్చినది… తలవంచి చూసాను
ఓ గడ్డిపువ్వు నా పాదాగ్రాన్ని సున్నితంగా మీటుతుంది. అంతే ఒక్కసారిగా నా మనసుకు చుట్టుకున్న అజ్ఞానపు సంకెళ్ళు పటాపంచలైపోయాయి…
ఓ చెలీ! నిన్ను పోల్చుకోలేకపోయిందుకు క్షమించవూ…
– శ్రీనివాస స్వీయరచన

RTS Perm Link

తుహిన తల్పం

Aug 17, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప

రాతిరంతా స్వప్నలోకంలో తిరుగుతుంటాను…
దూరమెళ్ళిన నేస్తమో దగ్గరైన బందమో ఎవరో గానీ నన్ను చేరి దారి పొడవున తోడు వస్తారు…
హాయి పూలను ఏరుకుంటూ గుండె గంపను నింపుకుంటూ రేయి ముగిసే వేళలోన కలలసంద్రపుటొడ్డుకి చేరుకుంటాను…
అంతదాకా చెంతనున్న వారు కాస్త నన్ను వీడి వెళ్ళిపోతారు…
గంపనేమో నేల దించి తడి తడిమిన ఇసుకమీద దాచుకున్న పూలతో అనుభూతుల ముగ్గులేసి మురిసిపోతాను…
ఏ దుష్ట హస్తమో మరే వికృత వాలమో తెగిపడ్డ అలలాగ కవ్విస్తూ కబళించి వెళ్ళిపోతుంది…
నా కలలను చెరిపేసి నన్నేమో వేకువ ముంగిట వదిలేసి మాయమౌతుంది…
– శ్రీనివాస స్వీయరచన

RTS Perm Link

కొత్త బట్టలు

Aug 11, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
నా బ్లాగుకి కొత్త బట్టలు కుట్టి తొడిగానండోయ్ ! కాస్త చూసి దీవించండి.
http://pkblogs.com/harivillu
సూచనలు, సలహాలు ఏవేనా స్వాగతం 🙂

ఏదీ రాయకపోతే బాగోదు కదా! అందుకే చిత్తుప్రతి నుండి కొన్ని తీసి ఇక్కడ రాస్తున్నా…

“ఎప్పుడైనా ఒంటికి మట్టి అంటుకుని దులుపుకుంటున్నప్పుడు చిన్నగా నవ్వుకుంటాను; ఏదో ఒకనాడు ఈ మట్టిలోనే కదా కలిసిపోతామని.”

“చినుకు జన్మ కడలిని కలవడంతోనే అంతమవ్వదు; చిప్పలో చేరి తపమేదో చేసి ముత్యమై తేలుతుంది కదా.”

“హే ప్రభూ… నీ పుణ్యం సంపాదించే ఆశతో పూలను తెంచే పాపం చెయ్యలేకపోతున్నాను.”

RTS Perm Link

RTS Mirror Widget


from JalleDa

పంచాంగం


Warning: fsockopen(): php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: fsockopen(): unable to connect to udp://whois.happyarts.net:8000 (php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known) in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: stream_set_timeout() expects parameter 1 to be resource, boolean given in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 125