ఎన్ని వేల వర్ణాలో…

Archive for August, 2006


రాతి హృదయం

Aug 8, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
అది ఓ ఉద్యానవనం. అందులో ఒక చోట ఓ పూలచెట్టు. అందమైన పువ్వులు నవ్వుతూ… త్రుళ్ళుతూ… వీచే గాలికి వయ్యారంగా ఊగుతూ… అటు వైపు వెళ్ళేవారికి పరిమళాన్ని పంచుతూ… ఓ రోజుకే జన్మ చాలిస్తున్నాయి. ఆ పూలచెట్టుకి ఓ వైపు ఒక బండరాయి. ఎన్ని సంవత్సరాల నుండి ఉంటుందో తెలియదు. పాపం కదలలేదు. ఎండకి రగులుతూ, వానకి తడుస్తూ, చలికి వణుకుతూ ఎవరి ఉపయోగానికీ నోచుకోని వ్యర్థ జీవి అయిపోయింది. చూసే వారికి ఏ కదలికా కనిపించకపోయినా ఆ రాయిని ఆర్తిగా తడిమితే విలపించే హృదయమొకటి కనిపిస్తుంది.

ప్రతిరోజూ నరక వేదన పాపం దానికి! ఆప్యాయంగా పలకరిస్తూ కేరింతలు కొడుతున్న పూలను చూస్తూ ఆనందిస్తుంది. ఇంతలో ఎటుంచో గాలి వీస్తుంది. పాపం లేలేత రేకులు ఒక్కసారిగా వణికిపోతుంటాయి; అప్పుడప్పుడూ వేడి గాడ్పులకు కమిలిపోతాయి. చివరికి పట్టుతప్పి రాలిపోతాయి. ఏమన్నా సాయపడదామంటే స్పందన ఉన్నా చలనం లేని జన్మ. కొన్ని రాలుతూ తన మీద పడుతుంటాయి. అయ్యో అందులోనూ తన శరీరం కఠినం. ఏమి చేయలేక కళ్ళు మూసుకుంటుంది. కొంతసేపటికి కళ్ళ తెరచి చూస్తే తన ముందు పడి విలవిలలాడుతున్న నేస్తాలు… వీడ్కొలు చెబుతూ తిరిగిరాని లోకాలకు…

ఇది కాకుండా ఇంకో సంఘటన తనని బాగా కలచివేసింది. ఒకసారి ఎవడో పసిపిల్లవాడు పరిగెత్తుతూ పట్టుతప్పి తనమీద పడిపోయాడు. ఆ పసికూన తలకి గాయమై తన నుదుటికి ఆ రక్తం అంటుకుంది. ఇక చూడాలి తన బాద! ఆ మరక పోవాలంటే వర్షం పడేదాకా ఆగాలి మరి. “ఓ భగవంతుడా, ఏమిటీ జన్మ. ఎందుకు నాకింత ఆయుష్షు. నేనేం పాపం చేసానని. నాకు విముక్తి కలిగించవా.” అంటూ ఓ రోజు మొరపెట్టుకుంది.

కొన్ని రోజులు గడిచాయి. ఓ ప్రభాతాన ఇద్దరు పలుగూ పారా పట్టుకుని తన వద్దకు రావడం ఆ రాయి చూసింది. ఒక్కసారి తనలో ఏదో తెలియని సంతోషం. వచ్చిన వాళ్ళు తనని ముక్కలు చెయ్యడం మొదలుపెట్టారు. చివరిగా ఈ లోకాన్ని ఒకసారి తనివితీరా చూసి కళ్ళు మూసుకోబోయింది. ఇంతలో ఓ పిల్లాడి కేరింతలు వినిపిస్తే అటు చూసింది. ఆహా! తన మీద పడిన చిన్నవాడు క్షేమంగా కనిపించాడు. పట్టలేని ఆనందంతో కళ్ళు మూసుకుంది.

– శ్రీనివాస స్వీయరచన

RTS Perm Link

అనుభూతుల కలబోతలు

Aug 7, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
సిరివెన్నెల కోసం పున్నమిదాకా వేచిచూడాలంటావా…
చిరుజల్లుల కోసం తొలకరిదాకా ఆగిచూడాలంటావా…
మిలమిల తారల కోసం రాతిరి వరకూ… కలకల పాటల కోసం ఉదయం వరకూ…
హరివిల్లు కోసం ఎండావానా సంగమించే వరకూ ఎదురుచూడాలంటావా…
ఓ ప్రియా నువు కనిపిస్తే చాలు ఎన్నెన్నో అనుభూతుల కలబోతలు
ఓ సఖీ నీ రాక కోసం అనుక్షణం ఈ గిలిగింతల తలపోతలు

RTS Perm Link

పాపం సర్దార్జీ…

Aug 2, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
ఈ విషయం ఇక్కడ రాయకూడదనుకున్నాను కానీ తప్పలేదు. గత కొన్ని నెలలుగా ఈమెయిల్స్‌లో గానీ ఏవైనా సైట్స్‌లో గానీ సర్దార్జీల మీద జోక్స్ ఎక్కువైపోతున్నయి.ఇవి చదివి నవ్వుకోడానికి బాగానే ఉంటాయి.కాని మనం నవ్వుకోవడానికి ఒక జాతిని ఉదహరించడం మంచిదికాదేమో! బుష్ కయ్యానికి కాలు దువ్వాడని అమెరికా వాళ్ళను నిందించడం, లాడెన్ మతమౌడ్యానికి ముస్లింలని తప్పుపట్టడం తప్పు కదూ. నాకు ఇలాంటి జోక్స్ మెయిల్స్‌లో వస్తుంటాయి. కానీ ఎవరికీ ఫార్వార్డ్ చెయ్యను. ఒక వేళ మీకెవరికైనా ఇలాంటివి వస్తుంటే ఏ శీనయ్యొ దానయ్యో అని పేర్లు మార్చి పంపించండి. సర్వేజనా సుఖినోభవంతు:

RTS Perm Link

RTS Mirror Widget


from JalleDa

పంచాంగం


Warning: fsockopen(): php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: fsockopen(): unable to connect to udp://whois.happyarts.net:8000 (php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known) in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: stream_set_timeout() expects parameter 1 to be resource, boolean given in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 125