
నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. తలచుకుంటే నవ్వాలో ఏడ్వాలో తెలియదు. తరగతిలో నేనెప్పుడూ చివరి వరుసలోనే కుర్చుంటాను. సాదారణంగా ఉపాధ్యాయులెవరైనా ముందు ఉన్న వాళ్ల మీదే దృష్టి పెడతారు. ఎక్కువ వాళ్ళనే అన్నీ అడుగుతుంటారు. నాకు అవన్నీ అంటే తలపోటు. అందుకే ముందు వరుసలో కుర్చోవడమంటే భయం!. అలాగని మొద్దుని కూడా కాదు. గణితంలో నాకు మంచి పట్టు ఉంది.
మీకు త్రికోణమితిలో ఒక పట్టిక గుర్తుండే ఉంటుంది. సైను, కొసైను అంటూ నాలుగు పాదాలు ఉన్న ఒక చిత్రం ఉంటుంది. దానిని ఆధారం చేసుకుని వాటికి ఒక పట్టికను తయారు చెయ్యాలి. మా గణితోపాధ్యాడు మాకు ఆ రోజు ఇదే ఇంటిపనిగా ఇచ్చారు. దానిని ఆ రోజు నేను చేయలేదు. కానీ మర్నాడు సాయంత్రం చూపించాల్సి ఉండటంతో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గుర్తుకు వచ్చి గబగబా రాసేసాను. నా ముందున కుర్చున్న ఓ ఎనిమిది మంది నా పుస్తకం తీసుకుని మక్కిక్కిమక్కి దించేసారు.
ఇక సమయం రాగానే మా ఉపాధ్యాయుడు వచ్చి అందరూ రాసారా లేదా అని ముందు వరుస నుండి అందరి పుస్తకాలను పరిశీలించడం మొదలు పెట్టారు. ఆయనకు వెనుకన ఉన్న వాళ్ళంటే కాస్త చిన్నచూపు. నా దగ్గరకు వచ్చి కాస్తంత తీక్షణంగా పరిశీలించారు. నేనొక చోట ఏదో తప్పు రాసాను; అది చూపించి నా చెంపను చెళ్ళుమనిపించారు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ముందు కుర్చున్న వాళ్ళందరూ నా వంక అయోమయంగా చూసారు. నేనేమీ మాట్లాడలేదు. నా పుస్తకంలో నుండి కాపీ కొట్టిన వాళ్ళు బతికిపోయారు. నేను దోషిలా నిలబడ్డాను. టైమ్ బాగోకపోవడం అంటే ఇదేనేమో!
RTS Perm Link
3 Responses for "టైమ్ బాగోకపోవడమంటే ఇదేనేమో !"
మీ రచనలు చాలా బాగున్నాయి. మీ ఇంటర్ లో జరిగిన సంఘటన గురించి రాశారు. మిమ్ములను చాలా కలవర పెట్టి ఉంటుంది.మీ జైజన్మభూమి చాలా బాగుంది.
మీరు రాసింది చదవడం వల్ల నాకు గుర్తుకొచ్చిన ఒక విషయం ఇక్కడ రాసాను. చదివి ఆనందించండి.
ప్చ్…
Leave a reply