ఓ యువరాణి మనోగతం

రాసినవారు శ్రీనివాస on Thursday, 21 of September , 2006 at 3:35 am


పాలరాతి కోటలో గాజుబొమ్మ కధ ఇది

జలతారు పరదాల చాటున దాగిన మనిషిని నేనట

పసివన్నె పయ్యెద మాటున ఒదిగిన మనసు నాదట

మా వనమున తిరుగుతున్న తుమ్మెదలు, తూనీగలు

నా చెంతకు చేరుకున్న వేళ నాకు చెలికత్తెలు

సోయగమున సౌగంధము వెదజల్లే కుసుమాలు

నా సొగసుతో చెలిమి చేయు వేళ నాకు నేస్తాలు

పసిడి పంజరాన నేనున్నా చిలుకలా…

ఊహలతో తాకుతాను నింగిని కిలకిలా…

అలసిపోయి రాలుతాను నేలను చినుకులా…

ఆశలతో సాగుతాను పచ్చని చిగురులా…

ఎన్నినాళ్ళు ఈ వేదన - రేపటికై ఆరాధన

ఎంతవరకు ఈ రోదన - చెప్పలేని ఆవేదన

నా స్వయంవరమున పూలమాల వరించే వాడు ఎవ్వడో వాడెవ్వడో

నా హృదయస్వరమును ఆలకించి ముక్తినిచ్చేవాడు ఎక్కడో వాడెక్కడో
- శ్రీనివాస స్వీయరచన

RTS Perm Link

వర్గములు: మనోగతం

3 అభిప్రాయాలు

radhika యొక్క అభిప్రాయము

Made Friday, 22 of September , 2006 at 11:22 am

chaala amdam ga vumdandi mee yuvaraani manogatam.picture kuda chala baagumdi

విహారి యొక్క అభిప్రాయము

Made Friday, 22 of September , 2006 at 1:20 pm

చాలా బాగుంది.
మనసు పలికే మౌన గీతం అంటే ఇంకా బాగుంటుందేమో.

విహారి
http://ideenaamadi.blogspot.com

శ్రీనివాస యొక్క అభిప్రాయము

Made Saturday, 23 of September , 2006 at 12:02 am

రాధిక గారికి, విహారి గారికి ధన్యవాదములు.
విహారి గారూ నేను ఇంతకు ముందు ఓ యువరాజు మనోగతం అని ఒక కవిత రాసాను. అలాంటి పేరు ఉంటే బాగుంటుందని ఈ పేరు పెట్టానండీ :)

అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

My Photoపేరు: శ్రీనివాసరాజు దాట్ల వృత్తి: 'పోకిరి' సినిమాలో బ్రహ్మానందం చేస్తాడే అది :) స్వస్థలం: వైశాఖపట్టణం నివాసం: సౌభాగ్యనగరం

చైత్రం నాది, శిశిరం నాది, వెలుగు నాది, చీకటి నాది, కష్టం నాది, సుఖం నాది, నవ్వు నాది, ఏడుపు నాది, అచ్చ తెలుగులో ప్రతి అనుభూతీ నాది.