ఈ రోజే తెలిసింది బ్లాగూ నీ విలువ…
రాసినవారు శ్రీనివాస on Thursday, 28 of September , 2006 at 9:33 pm
ఈ రోజే తెలిసింది బ్లాగూ నీ విలువ… అని పాడుకోవాలనిపిస్తుంది.

సాధారణంగా నేను రాసేవాటిని నా బ్లాగులో ప్రచురిస్తాను. వేరే ఏ సైటుకి పంపను. క్రిందటి ఆదివారం తెలుగుబ్లాగ్ సభ్యులతో కలిసి తెలుగు సాహితీ ప్రేమికుల సమావేశానికి వెళ్ళాను. అక్కడ తెలుగు పీపుల్ డాట్ కామ్ గురించి విన్నాను. అక్కడ సమావేశమైన వాళ్ళు చాలా మంది అందులో సభ్యులట. అక్కడ నుండి వచ్చిన తర్వాత ఆలోచించాను; సరదాగా ఏదన్నా తెలుగుపీపుల్స్ లో ప్రచురించడానికి పంపించాలనుకున్నాను. అసలు టీపీ ఎలా ఉందోనని చూసా; చిన్న కథలని, నవలలని, కవితలని రకరకాలు. అమ్మో ఎన్ని విభాగాలో! మనం బ్లాగులో రాసేవి మనకు ఇష్టం వచ్చినట్టు రాస్తాం. ఏదన్నా అనుభవం గానీ, అనుభూతి గానీ పొందినప్పుడు లేదా పాతది ఏదన్నా గుర్తుకు వచ్చినప్పుడు, దానిని మనకి ఏ రూపంలో వీలుగా ఉంటే అలా రాసి బ్లాగులో పెట్టేస్తాం. దానికి పరిమితులు ఉండవు. కానీ ఏవైనా సైట్స్ కి పంపాలంటే కొన్ని పాటించాల్సి వస్తుంది. నా బ్లాగులో నుండి పాతది ఏదైనా తీసుకుని పంపిద్దామని వెతికా. కానీ ఏ విభాగానికి పంపించాలో సందిగ్ధత. చివరికి చిన్నకధల విభాగంకి నా నిజ సౌందర్యం ని పంపిచాను. అది వెళ్ళిందో లేదో అని ఒక చిన్న సందేహం. ఈసారి నా రాతి హృదయం ని పంపించాను. ఓ రెండు రోజుల తర్వాత నిజ సౌందర్యం ప్రచురించామని టీపీ నుండి మెయిల్ వచ్చింది. http://telugupeople.com/discussion/article.asp?id=45793 .
దాన్ని చూసాను, పరవాలేదు ఏదీ మార్చకుండా ఉన్నది ఉన్నట్టే దించేసారు. ఓ రోజు తర్వాత ఎవరో తమ అభిప్రాయాన్ని రాసారు అని మెయిల్ వచ్చింది. వెంటనే వెళ్ళీ చూసా. సాదారణంగా బ్లాగులో అయితే బాగుందనో లేక బాగోలేదనో తెలుపుతారు. అక్కడ రాసింది చూస్తే నాకు నవ్వొచ్చింది. నేను రాసింది చాలా చిన్నదన్నారు గానీ అసలు బాగుందో లేదో చెప్పలేదు. ఇంకా మిగిలినవారు రాసింది చూస్తే అబ్బో వెటకారం. ఇంకా సంతోషం ఏదన్నా కవితని పంపించలేదు; అది కవిత కాదని పచ్చిగా తిట్టినా తిట్టగలరు. బతికిపోయా!
ఇలాంటి అనుభవమే నాకొకసారి ఇంతకు ముందు ఎదురైంది. రెండు సంవత్సరాల క్రితం ఓ రెండు రోజులు ఫిల్మ్ నగర్ లో తిరిగి తిరిగి ఓ నిర్మాతను పట్టుకున్నాం. ఓ రెండు కధలు వినిపించాను. అబ్బే తనకి ఇవి నచ్చలేదన్నాడు ఆ నిర్మాత. ఏదన్నా యాక్షన్ కధని వెంకటేష్ కి రాసి తీసుకురమ్మన్నాడు. మళ్ళీ నేను అటు వైపు చూడలేదు. పాపం మా బావ(ఆర్కుట్ బంధం) ఇందుకూరికి కూడా అలానే జరిగింది. తాను రాసింది ఈనాడుకి పంపిస్తే 50 శాతం కి పైగా మార్చేసారంట! ఎదేమైనా బ్లాగు బాగేనండీ. మనసారా రెండు ముక్కలు రాయొచ్చు, లేదా వ్యాసాలకు వ్యాసాలు రాయొచ్చుస్వేచ్ఛగా.
ఇహ ఒకటే నిర్ణయం తీసుకున్నాను. ఇక ఏది రాసినా నా మానసపుత్రిక అయిన బ్లాగులోనే రాద్దామని.
ఓ బ్లాగూ దీర్ఘ సుమంగళీ భవ
వర్గములు: కలగూరగంప
- ఈ టపాను వీటికి జతచేయండి
- Del.icio.us -
- Meneame -
- Digg
radhika యొక్క అభిప్రాయము
Made Friday, 29 of September , 2006 at 8:08 am
T.P ni ki nenu taracu velutuntaanu.akkada vimarsalakannaa vetakaaraalu ekkuva vumtaayi.manchi vimarsa manchi kavini tayaaru cestumdantaaru.kaani akkada vimarsa peru tho vetakaaraalu cestaru.rojuko debbalaata anduloni sabyula madya.meeru T.P lo kavitala section okasari chudandi.andulo yuva kavulanu elaa niraasaparustaaro.aa lekkana custe mee kadha ki vaallu chala manchi ga reply ichinattu.
Giri యొక్క అభిప్రాయము
Made Friday, 29 of September , 2006 at 4:08 pm
Sri,
I read your story and the comments. Agree that the comments aren’t very flattering. I didn’t think your write-up was a short story, but i could gather you put in a lot of emotional energy in to it. The least someone should have done is acknowledge that.
But the fact they didn’t do it shouldn’t deter you from posting more articles. Bad reviews and comments in bad taste are quite common in any field related to creativity - the parameters for measurement get very subjective there, that’s why.
While i understand how you feel, i don’t necessarily agree with your decision of quitting TP and doing your own thing.
Btw, i submitted a couple of my write-ups today - will wait and see how they fare with the harsh critics.
Naveen యొక్క అభిప్రాయము
Made Sunday, 1 of October , 2006 at 12:20 am
దాట్ల గారు, ఈ పోస్ట్ చూసిన తర్వాత, ఏదోలే జీవుడు బాధ పడూతున్నాడు అనుకొన్నా. తర్వాత మీరు రాసిన కవితాత్మక కధ చదివా, దాని కింద వున్న వ్యాఖ్యలనూ చదివా. వ్యాఖ్యలను చదివితే నాకే చురుక్కు మంది. మీకెలా ఉంటుందో ఊహించగలను. ఎలా అంటే.. నేను కూడా.. బుడి బుడి నడకలు కూడా రాని రచయితని. సరిగ్గా చెప్పాలంటే, అవ్వాలని ప్రయత్నిస్తున్న వాణ్ణి. మాలతీ చందూర్ గారు అన్నట్లు గుర్తు, “వెయ్యి కథలను చదివిన పరిశీలించిన తర్వాత గాని తర్వాత నీ మొదటి కధ ను మొదలు పెట్టకు” అని. నేను ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాను.
ఇక మీ కథకు వస్తే.. బావుంది. అంతర్లీనంగా మీరు చెప్పదలుచుకొన్న భావాన్ని నేను అర్థం చేసుకొన్నాను. కానీ మన కధ ప్రచుణార్హం కావాలనుకొన్నప్పుడు… ప్రేక్షకుల నాడిని అర్థం చేసుకొని రాయటానికి ప్రయత్నించండి. ఎంత కృషి చేసినా అనవసరపు విమర్శలు చేసే కుక్కలు కొన్ని ఉంటాయి. వాటికి విమర్శించినంత తేలిక కాదు, రచనలు చేయటం అని తెలీదు. అటువంటి వారు… సంఘానికి ఉపయోగపడరు. మీరు బేషుగ్గా రచనలు చేసి.. బ్లాగుతూండండి.. నేను చదివుతాను.
నవీన్ గార్ల
http://gsnaveen.wordpress.com
శ్రీనివాస యొక్క అభిప్రాయము
Made Sunday, 1 of October , 2006 at 7:32 am
Hai Radhika garu, Naveen garu and Giri garu. Thanks for your response for this post. Please bear my English as I am not good in it. Let me clarify that i am not feeling bad about the comments on my story published in TP. Who Cares :-). I just compare the beauty of blog with TP (or some other sites like this one) . I didn’t make any commment on TP. It is an outburst of how much comfortable i am with blogging. I think that I never make any one feel in this aspect. Cheers.. Keep Smiling and Keep Blogging. Wait for my next post…
ఈ జాబుకు స్పందించినందుకు రాధిక ,నవీన్ మరియు గిరి గారికి ధన్యవాదములు. ముందు నా మనసులో మాట చెప్పనివ్వండి. నేనసలు టీపీలో అభిప్రాయముల గురించి తప్పుగా అనుకోవడం లేదు. అలా ఆలోచించి ఉంటే నేను నా ఈ-పాళీతో అంతర్జాల పుటపై లిఖించే వాడినే కాదు. అసలు ఇదంతా ఎందుకు, వికీపీడియాలో చేరిన కొత్తలో నేను తెలిసీ తెలియక తప్పటడుగులు వేస్తుంటే సరిదిద్దిన రవిగారన్నా చదువరిగారన్నా నాకిప్పటికీ అభిమానమే. నా ఉద్ధేశ్యం ఏమిటంటే బ్లాగింగ్ లో ఉన్న స్వేచ్ఛా సౌందర్యాన్ని టీపీ లాంటి సైట్లతో పోల్చానంతే. మనసులోని ఆలోచన ఎప్పుడు ఏ రూపం తొడుక్కుంటుందో తెలీదు. దానిని పెద్దది చేసో చిన్నది చేసో వేరే చట్రంలో ఇమడ్చటం నాకు నచ్చదు అని అంటున్నాను అంతే! అందుకే యదా మనస్ తదా బ్లాగు అని అంటున్నా. ఈ నా అభిప్రాయంతో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. అబ్బ! ఒకసారి నవ్వండి ప్లీజ్
నా తదుపరి జాబుతో మిమ్మల్ని తప్పక అలరిస్తానని తెలియజేస్తూ…
- మీ శ్రీ
పేరు: శ్రీనివాసరాజు దాట్ల వృత్తి: 'పోకిరి' సినిమాలో బ్రహ్మానందం చేస్తాడే అది :) స్వస్థలం: వైశాఖపట్టణం నివాసం: సౌభాగ్యనగరం