కన్నీటి చెలమలలో కష్టాల నేస్తాలు సేదతీరేలా పొగిలి పొగిలి ఏడ్చేస్తాను…
తిష్టేసి కూర్చున్న బాదల చుట్టాలు పారిపోయేలా పగలబడి నవ్వేస్తాను…
****
నా వెనక గోతులు తీసేవాళ్ళను చూస్తే జాలి…
పడిపోతారేమో వాటిలో పాపం వాళ్ళే ఖర్మకాలి…
నా ముందు నీతులు చెప్పేవాళ్ళను చూసినా జాలే…
ఏమౌతారో వాళ్ళు చెప్పినవి పాటించాల్సి వస్తే వాళ్ళే…
****
మా నాన్న చదివెన్ ఏడో తరగతి…
మా అమ్మ చదివెన్ మూడో తరగతి…
మొత్తానికి ఇద్దరూ కలిసి పూర్తిజేసెన్ పదోతరగతి…
****
తాత విత్తు నాటి నీరు పోసాడు…
నాన్న కాపు కాసి మొక్క పెంచాడు…
కొడుకు నీడ కోరి చెట్టు చేరాడు…
ఎవడో కబ్జాదారుడు ఆ సరికే సేదతీరుతున్నాడు…
****
అందరూ వదిలిపోయారు నన్ను…
నేను ఏకాకిని ఇప్పుడు…
తల్లి, తండ్రి, చెల్లి, ఆలి…
హితులూ, స్నేహితులూ, బందువులూ…
నిర్ధాక్షిణ్యంగా, నిర్వేదంగా…మూకుమ్మడిగా…
ఈ ఆరడుగుల సామ్రాజ్యానికి నన్ను రాజుని చేసి వెళ్ళిపోయారు…
నేను ఏకాకిని ఇప్పుడు…
5 Responses for "కలగూరగంప-1"
అద్భుతం.అతి సరళం గా గొప్ప సత్యాలు చెప్పారు.నాకు మొదటిది,చివరిది చాలా బాగా నచ్చాయి.
చివరిది బాగా నచ్చిందండి. ఎన్ని చేసినా, ఎంత మంది ఉన్నా, ఎన్ని సాధించినా ఏవీ మనతో రావు, ఉండవు. వైరాగ్యమే అయినా కఠిన సత్యం ఇది.
chala bagundandi..
సూపర్! నాక్కూడా అర్థమయ్యేలా ఉన్నాయీ కవితలు
cnu,mee kavitha lu kaani, mee alaochanalu kaani chala baguntavi.prathi padam entho chakkaga amarchi ponduparstaru.
meeru rasina vatilo chivari daniki chinna comment,
pradidi manathone eppatiki unte ,kotta ane daniki chottu undadu kada.ee manishi eppudu ontari vaaru kaaru.evvaro okkaru tanaki untaru.
Leave a reply