ఎన్ని వేల వర్ణాలో…
ఇంతకు ముందు పనిచేసిన కంపెనీకి రోజూ వెళ్ళే ముందు పంజాగుట్ట జంక్షన్‌లో ఒక హోటల్‌లో ప్లేటు ఇడ్లీ తిని వెళ్ళడం అలవాటు. మనకి గునపాలతోనూ, పారలతోనూ (అంటే ఫోర్క్‌లూ, స్పూన్‌లన్నమాట) తినడం అలవాటు లేదు. ముందు ఏమీ పట్టించుకోకుండా తినేసేవాడిని. తర్వాత ఒక రోజు గబగబా తింటున్న నాకు పక్కనే తింటున్న ముసలతను కనిపించాడు. రెండు స్పూన్లతో ఇడ్లీని చీల్చి చెండాడుతున్నాడు. ఒకసారి చుట్టూ చూసా; ఒకడైతే దోశెని చిన్న చిన్న ముక్కలు చేసి సాంబారులో వేసి నానాకా స్పూన్‌తో లాగించేస్తున్నాడు. ఒకసారి ఆలోచించా. ‘ ఆ బొంగు! మన అలవాటు మనదిలే. వాడ్ని వీడ్ని చూసి మనం బాదపడడం దేనికి . ఓరి భగవంతుడా! కుడిచేతికి ప్రత్యామ్నాయంగా స్పూన్లని, ఫోర్కులని ఇచ్చావా తండ్రి’ అని అనుకుని చాలా రోజులు వెళ్ళబుచ్చా.
ఈ మధ్యే ఓ బజాకంలో ఉద్యోగం వచ్చింది. నా ఒంటికి పడని పనులన్నీ మొదలెట్టడ్డానికి సమయమొచ్చిందనుకున్నా. బూట్లేసుకోవడం, బెల్టు పెట్టుకోవడం, టై కట్టుకోవడం – ఇవి నాకు ఇష్టం లేనివి. కానీ తప్పదు కదా. జాయినయిన రోజు ఆవేశంతో టై కట్టుకెళ్ళిపోయా! అక్కడ నాలా జాయినవడానికి వచ్చిన వాళ్ళెవ్వరూ కట్టుకుని రాలేదు. పైగా వాళ్ళలో చాలా మంది కొంచెం పెద్ద కంపెనీల నుండి వచ్చిన వాళ్ళే. ఇంక అప్పటినుండి ప్రతీ సోమవారం నా పేంటు ఎడమ జేబును ఆ టైకి కేటాయించేసా! ఎప్పుడన్నా అత్యవసర పరిస్తితి వస్తే ఆ నాగులయ్యను మెడనేసుకుని శివయ్యనైపోవచ్చని నా ఆలోచన.
ఇక మధ్యాహ్నం భోజనం విషయానికొస్తే; అసలు ఇబ్బంది మొదలు. నా స్నేహితులనేవారు అలాంటీ బజాకంలలో మన ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించి అక్కడ అట్మాస్ఫియర్‍ని స్పాయిల్ చెయ్యడం దేనికి అని. ఇంక తప్పదు కదా; నెమ్మదిగా అలవాటు చేసుకోవడం మొదలుపెట్టా. నా చుట్టుపక్కల ఎవరన్నా చేత్తో తింటున్నా పట్టించుకోవడం లేదు. ఒకసారి ఓ పెద్దాయన (హోదాలో) చేత్తో కలుపుకుని తింటుంటే నేను ఆవేషపడ్డానని తెలుసుకుని నోరెళ్ళబెట్టా. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అని అన్నారిందుకే మరి.
చెక్కభజన అన్న పదానికి అర్ధం ఇక్కడే తెలిసింది. మూడునెళ్ళ నుండి బెంచి మీంచి దించడంలేదు. మొత్తానికి రోజూ కంపెనీ నుండి బయటికిచ్చి టక్ పీకి, స్వైప్ కార్డుని జేబులోకి నెట్టెసి ఒక్కసారి గాలి పీలిస్తే గానీ మళ్ళీ మన లోకంలోకి వచ్చినట్టు ఉండదు.
16 Responses for "శ్రీనివాసీయం – 1"
మీ శ్రీనివాసీయం బాగుంది.కత్తులు కటార్లతో తినడమంటే నాకో సంఘటన గుర్తొచ్చింది…సమయం దొరిగినప్పుడు దాని గురించి బ్లాగుతా!
సంవత్సరం క్రితం ఇక్కడ ఒక ఇండియన్ రెష్టారెంట్ కి వెళితే అక్కడ నేను చేతితో తినడం చూసి కొంత మంది అమెరికన్లు నావైపు చూసిన చూపు మర్చిపోలేను.అక్కడికక్కడే చచ్చిపోవాలనిపించేంత అసహ్యకరమయిన చూపు.[కానీ నేను మరీ అంత అసహ్యకరం గా తిననే?] అప్పటి నుండి బయట తిన్నప్పుడు కత్తులు,కటారులు తప్పక ఉపయోగిస్తున్నాను. ఇంట్లో మాత్రం హస్తం గుర్తుకే మన వోటు.
Radhika garu cheppindi aksharala nijam. naku ilanti anubhavame eduru ayindi. so appatininchi kashtamaina Kattulu upayoginchavalisi vastundi. intlo matram cheyi tone…
రాధిక గారు మీరు తింటుంటే అలా చూసారు. నేను నా ఫ్రెండుకి ఇంటిలో చేత్తొ భొజనం చేస్తానని చెబితేనే నేనేదో మహా నేరం చేసినట్లు మాట్లాడాడు. నేను మాత్రం తక్కువా ఏంటి వాడికి మన పద్దతుల గురించి క్లాస్ పీకి ఇంకెప్పుడు అలా అననని వాడి చేత చెప్పించాను. నేను కూడా రెస్టారెంట్లలొ కత్తులు కటార్లు వాడుతాను. కానీ ఇంటిలో మాత్రం చేయి వాడాల్సిందే.
నా ఉద్దేశ్యం ప్రకారం రోమ్ లో రోమన్లా వుండటమే మంచిది. అందునా వ్యాపార సంభందిత కార్యక్రమాలలో ఇది మరీ అవసరం. స్పూన్లు, ఫోర్కులు కూడా ఒక పద్ధతిలో వాడాలి. నాలుగు టేబుల్ల అవతలి వరకూ వినిపించేలా చప్పుడు చేసే వాళ్లని నేను చూశాను. కాబట్టి పరిస్థితిని బట్టి మసలుకోవటమే మంచిది.
నాకు స్పూన్లు, ఫోర్కులు వాడటం పెద్దగా ఇష్టం ఉండదు. నేను నాకు కంఫర్టబుల్ గా ఉండేటట్టే ప్రవర్తిస్తాను కానీ అలా చెయ్యాలి కాబట్టీ, అందరూ చేస్తారు కాబట్టి చెయ్యను. కానీ సుధాకర్ గారు అన్నట్టు కొన్ని సందర్భాలలో అవసరం కావచ్చు.
సుధాకర్ గారు మీరన్న బిజినెస్ మీటింగులో తినడానికి వెళ్లరు కాబట్టి సరిపోతుంది. మీకు తెలుసా జీవితాంతము కత్తులు కటార్లు ఉపయోగించేవాళ్లే అలాంటి మీటింగుల్లో సులువుగా తినగలిగే పదార్ధాలే ఆర్డరు పెడతారు. ఏం ఆ చూపుచూసిన వాళ్లందరూ సబ్వేలో సబ్ని ఎలా తింటారు? మరి మెక్‌డోనాల్డ్ లో బిగ్ మాక్, బర్గర్ కింగ్ లో వాపర్, పిజ్జా హట్లో పిజ్జా…మన తిండ్లు చేత్తో తింటేనే రుచి. ఇష్టం లేకపోతే వాళ్లు భారతీయ తిండి తినటానికి ఎందుకొచ్చారు..రాధిక గారూ..ఎలా తినాలో మీరు వాళ్లకు నేర్పించటం పోయి..మీరు పద్ధతి మార్చటం బాగాలేదు. అయినా వళ్లు ఎలా తినాలో తెలియక మీవంక కాపీ కొట్టడానికి చూశారేమో?
మన చెయ్యి మనకే సొంతం అదే ఆ కత్తులు..కటార్లు ఎంత మంది నోళ్లో పెట్టుకున్నారో
రవీ..కత్తి లాగా చెప్పావు……
పందిని..కుక్కల్నీ..కాల్చి..స్పూన్లతో..ఫోర్కులతో తింటే లేని అసహ్యం..చేత్తో పప్పన్నం తింటూంటే వచ్చిందా..విచిత్రమైన విదేశీయులు.
బజాకం అంటే బహుళ జాతి కంపనీ అనా? పదప్రయోగం బాగుంది.
అవును రమణ, మీరనుకున్నది నిజమే.
bagundi, ilanti anubhavalatho ippati vallu thantalu padavalasinde
కత్తులు కఠారులతొ తినడం వ్యాపార, ఉద్యొగ పరమైన విందులలొ తప్పదు కానీ వ్యక్తిగతమైన భోజనం మాత్రం చేత్తోనే తింటాను. మాంసం కాల్చుకు తినడం, రెండు రొట్టెల మధ్యలొ ఎదో ఒక గడ్డి కుక్కుకొని తినడం మాత్రమే తెలిసిన వాళ్ళ దగ్గర మనం తినే పద్ధతి నేర్చుకోవాల్సిన అవసరం లేదని నా ఆభిప్రాయం.
By the way బజాకం పద ప్రయోగం అదిరింది
ఉద్యోగంలో చేరిన కొత్తల్లో భోజనందగ్గర నాకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. అన్నము, పప్పు, తాళింపు (అనబడు కర్రీ) వీటిని స్పూన్లతో కలిపి తినేజనాల మధ్యలో నేనూ భోంచేయాల్సిరావడం. స్వధర్మో నిధనం శ్రేయః అని, నేనుమాత్రం హాయిగా చేత్తో కలుపుకొని ఆనందంగా తిన్నాను. తర్వాత్తర్వాత అక్కడ నాలాంటి జనాలు బాగా పెరిగారు.
chaalaa baagundi.
Andariki Namskaram.
Meeru Andaru cheppindi bagundi kani anta na istam naku nachinattugane nenu chesta vallu yem anukunte nakem ani urake undagalama anedi na sandeham
Leave a reply