అంతా RTS మయం…

రాసినవారు శ్రీనివాస on Saturday, 13 of October , 2007 at 1:01 pm

On Depression ఏంటో నన్ను గత కొన్ని నెలలుగా వింత అలవాటు పట్టుకుంది. ఏదన్నా ఆంగ్లంలో చదవాల్సి వస్తే ప్రతీదాన్నీ RTSలో చదువుతున్నాను. RTS పరిచయం కాక ముందు ఒకసారి ICICI ని ఇకికి అని సరదాగా చదివా; అప్పటినుండి ఆ పేరు కనిపిస్తే చాలు ఇకికి అని నోట్లోకొచ్చేస్తుంది. ఇక RTS తోడయాకా ఆ అలవాటు ముదిరిపోయింది. ఈ మద్యన ఒకసారి ఐడియల్‌ బ్రెయిన్ లో వెదుకు (veduka) అని ఒక సినిమా పేరు చూసి పలికా. అంతే నా పక్కోడు అది వేడుక అని చెబితేగానీ నేను దానిని ఏ పద్దతిలో చదివానో అర్దం చేసుకోలేకపోయా! మొన్నయితే మాకు కొత్త ప్రాజెక్ట్ గురించి ఒక మెయిల్ వచ్చింది; అందులో దాని పేరు Nene అనుంది. నెనె అని నేను దాన్ని గుర్తుంచుకుంటే తర్వాత తెలిసింది దాని పేరు నీన్ అని !

RTS Perm Link

అభిప్రాయాలు (2)

వర్గములు: కలగూరగంప

My Photoపేరు: శ్రీనివాసరాజు దాట్ల వృత్తి: 'పోకిరి' సినిమాలో బ్రహ్మానందం చేస్తాడే అది :) స్వస్థలం: వైశాఖపట్టణం నివాసం: సౌభాగ్యనగరం

చైత్రం నాది, శిశిరం నాది, వెలుగు నాది, చీకటి నాది, కష్టం నాది, సుఖం నాది, నవ్వు నాది, ఏడుపు నాది, అచ్చ తెలుగులో ప్రతి అనుభూతీ నాది.