ఎన్ని వేల వర్ణాలో…
ఏంటో నన్ను గత కొన్ని నెలలుగా వింత అలవాటు పట్టుకుంది. ఏదన్నా ఆంగ్లంలో చదవాల్సి వస్తే ప్రతీదాన్నీ RTSలో చదువుతున్నాను. RTS పరిచయం కాక ముందు ఒకసారి ICICI ని ఇకికి అని సరదాగా చదివా; అప్పటినుండి ఆ పేరు కనిపిస్తే చాలు ఇకికి అని నోట్లోకొచ్చేస్తుంది. ఇక RTS తోడయాకా ఆ అలవాటు ముదిరిపోయింది. ఈ మద్యన ఒకసారి ఐడియల్ బ్రెయిన్ లో వెదుకు (veduka) అని ఒక సినిమా పేరు చూసి పలికా. అంతే నా పక్కోడు అది వేడుక అని చెబితేగానీ నేను దానిని ఏ పద్దతిలో చదివానో అర్దం చేసుకోలేకపోయా! మొన్నయితే మాకు కొత్త ప్రాజెక్ట్ గురించి ఒక మెయిల్ వచ్చింది; అందులో దాని పేరు Nene అనుంది. నెనె అని నేను దాన్ని గుర్తుంచుకుంటే తర్వాత తెలిసింది దాని పేరు నీన్ అని !
2 Responses for "అంతా RTS మయం…"
Telugu padaluni englishlo type chesinappudu chadavatamu bhale saradaga vuntundi.
Peddollantha = pedollantha
ఇకికి.. భలే నవ్వు తెప్పించింది.
ఇలాంటి అనుభవాలు నాక్కూడా ఎదురయ్యాయి కానీ మరీ మీ అంత గా కాదు లెండి.
Leave a reply