మీలో ఎవరైనా thefreedictionary.com సైటుకు వెళ్లుంటే అక్కడ ఉన్న ఒక వెసులుబాటు తెలుసుంటుంది. ఆ వెబ్‌పేజీ మీద కనిపించే ఏ పదాన్నయినా డబుల్ క్లిక్ చేసినప్పుడు ఆ పదానికి అర్థం ఉన్న వెబ్‌పేజీ తెరచుకుంటుంది. దాన్ని చూసినప్పుడు కలిగిన ఆలోచనకు ప్రతి రూపమే ఈ శ్రీ శోధన ప్లగ్‌ఇన్. ఇది పూర్తిగా జావాస్క్రిప్ట్‌లో రాయబడింది. యూనీకోడ్ సపోర్టు ఉంది. జావాస్క్రిప్ట్ కోడ్ జోడించడానికి వీలున్న ఏ వెబ్‌పేజీలోనయినా దీనిని ఉపయోగించవచ్చు. మీరు చెయ్యవలసిందల్లా…
<script src=”http://harivillu.org/plugins/srisodhana.js”></script> ని మీ వెబ్‌పేజీలో ఉంచడమే. ( ప్రస్తుతం దీన్ని పాటిస్తే మంచిది; ఎందుకంటే దీనిని మరింత క్రియాత్మకంగా చేయవలసి ఉంది. కాబట్టి ముందు ముందు ఏమన్నా మెరుగుపరిస్తే అది మీ సైట్‌లలో వెంటనే ప్రతిఫలిస్తుంది ).
లేదా
srisodhana.js ఫైలును మీ సైటులోకి ఎగుమతి చేసుకుని దానిని ఉపయోగించుకోవచ్చు.
ప్రస్తుతం ఇది ఐఈ, ఫైర్‌ఫాక్స్, నెట్‌స్కేప్‌లలో పనిచేస్తుంది. ఒపేరాలో డబుల్‌క్లిక్ ఈవెంట్‌ని స్వంత పాప్‌అప్ కోసం ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఇది పనిచేయదు.

ఈ ప్లగిన్ వలన ఉపయోగమేమంటే మీరు ఏదన్నా పదం మీద డబుల్‌క్లిక్ చేసినప్పుడు ఒక చిన్న పాప్‌అప్‌ని చూపిస్తుంది. దానిలో మీకు తెవికీ, గూగులమ్మ, బ్రౌను అని మూడు ఎంపికలు కనిపిస్తాయి. వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. వాటి కింద మీరు డబుల్‌క్లిక్కిన పదానికి అక్షరాలు తగ్గిస్తూ ఉన్న మరికొన్ని పదాలకు లింకులు కనిపిస్తాయి. మీకు కావలసిన పదం మీద క్లిక్కితే మీరు పైన ఎంచుకున్న సైటులో ఆ పదం తాలూకు పేజీని తెరుస్తుంది.
ఈ బ్లాగులోనే మీరు డెమో చూడొచ్చు. ఏదన్నా పదం మీద డబుల్‌క్లిక్ చెయ్యండి మరి.
15 Responses for "శ్రీ శోధన ప్లగ్‌ఇన్"
కూల్… తయారయ్యిందన్నమాట.
చాలా బాగుంది.
అన్నట్టు మీ బ్లాగు మీద దీని డెమో చూడవచ్చని చెప్పండి జనాలకి. ఈజీగా గ్రహించగలుగుతారు మీరు చెప్పేది.
తప్పులు పడుతున్నాను అనుకోకపోతే బ్లాంకుల మీద క్లిక్కినప్పుడు పాపప్ రాకుండా ప్రయత్నించవచ్చేమో ??
ఉదా: ఓ ఖాళీ లైను ఎంచుకుని దాని మీద డబల్ క్లిక్కు చేస్తే ఉత్త మూడు వర్టికల్ లైన్లు కనబడుతున్నాయి. ఇంకా వేరే చోట్ల కూడా ఇది సాధ్యమే.
భేష్! చాలా బాగుంది. మంచి ఫీచర్.
నెనర్లు ప్రవీణ్
మీరు చెప్పినట్టు డెమో విషయం టపాలో జతచేసాను. మీరు చెప్పిన ‘బ్లాంకుల మీద క్లిక్కినప్పుడు …’ సంగతి కూడా చూస్తాను.
చాలా మంచి ప్రయత్నం. కీపిటప్
వెంకట్
http://www.navatarangam.com
బావుందండి. కాసిని సూచనలు:
1. పదం యొక్క అర్థాల కోసం చూస్తారు కాబట్టి విక్షనరీ కూడా ఉంటే బాగుంటుంది.
2. Esc నొక్కినపుడు, ఆ పాపప్ పోతే బావుంటుంది.
3. ఈ వ్యాఖ్య పెట్టెలో రాసిన పదమ్మీద డబుల్‌క్లిక్కినపుడు బ్లాంకును నొక్కితే ఎలా వస్తుందో అలా వస్తోంది.. నొక్కింది పదమ్మీదేనైనా
చాలా బాగుంది మీ ప్రయోగం/ఆలోచన. మీరు మీ కోడుని ఇంకొద్దిగా modularize చేసి దానిని మరింత చిన్నదిగా చేయొచ్చు. ఉదాహరణకు: మీరు ఒక చోట మూడు checkboxలను తయారు చేస్తున్నారు, ఆ కోడును ఒక functionలో రాసేసుకుంటే దానినే మళ్లీ మళ్లీ ఉపయోగించేసుకోగలుగుతారు. అలాగే మీరు సృష్టిస్తున్న నాలుగు లింకులను కూడా modularize చేయవచ్చు. మొత్తంగా చూస్తే మీ ప్లగిన్ కోడుని ఇంకో 2KB వరకూ తగ్గించేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఆఫీసులో కోడురీడుంగులను బాగా ఎక్కువగా చేస్తున్నాను, అందుకనే మీ కోడును కూడా ఒకసారి చదివేసాను
…
మొత్తానికి డిసైను పరంగా మీ ప్లగ్గినుకు 100 మార్కులను ఇచ్చేస్తున్నాను, చాలా బాగా ఆకర్షణీయంగా ఉంది. అలాగే చాలా సులువుగా ఎక్కడంటే అక్కడ install చేసుకోగలిగే విధంగా ఉంది.
అంతా బాగానే ఉంది కానీ, popup headingలో (e-తెలుగు సౌజన్యంతో) అని ఎందుకు పెట్టారో చెప్పలేదు?
@ప్రవీణ్ నెనర్లు, మీరు చెప్పినట్టు బ్లాంకుల మీద క్లిక్కితే పాప్‌అప్ రాకుండా కాస్త కోడ్ మార్చాను. ఇంకా మెరుగుపరచాలి.
@వికటకవి గారూ, వెంకట్ గారూ నెనర్లండి.
@చదువరి గారూ నెనర్లండీ, మీరు చెప్పినట్టు విక్షనరీని కూడా ఎంపికలో పెట్టాను. Esc నొక్కితే పాప్‌అప్ పోయేలా కోడ్ జతచేసాను.
ప్రస్తుతం ఫైర్‌ఫాక్స్‌లో పెట్టెలో ఉన్న పదాలకు ఈ పాప్‌అప్ కోడ్ పనిచేయడం లేదు. బ్లాంకు పాప్‌అప్ మాత్రం రాకుండా చేయగలిగాను.
@ప్రదీప్ నెనర్లు, మీరు చెప్పినట్టు కాస్త modularize చేసాను; ఇంకా చెయ్యవలసి ఉంది.
e-తెలుగు సౌజన్యంతో అని హెడ్డింగులో లంకె పెట్టడానికి కారణం మనం ఎలాగూ e-తెలుగు సభ్యులమే కదా; దానికి ఒక లంకె వేద్దామని అలా పెట్టాను
మంచి స్క్రిప్ట్.
బ్రౌన్ లింకులో ‘display=utf8′ అన్నది కూడా తగిలించు. అప్పుడు ఆ సైటులో తెలుగు పదాలు తెలుగులోనే కనిపిస్తాయి.
వీవెన్ నెనర్లు. నువ్వు చెప్పినట్టు జతచేసాను.
[...] దాట్ల శ్రీనివాసరాజు శ్రీ శోధన ప్లగిన్ అనే అందమైన ఓ చిన్ని పరికరాన్ని తయారు [...]
[...] Datla Srinivasa Raju has come out with a simple, yet useful tool named as Sri Sodhana Plugin. The tool enables the User to search the meanings - in various online Dictionaries, - of a word or a [...]
మీ Plugin చాలా బాగున్నది.
sir, why dont you make it a greasemonkey script so that you can use the script in any site you are viewing
మధు, కాళిదాసులకు నెనర్లు. కాళిదాసుగారు నాకు ఈ ఆలోచన రాలేదండీ. గుర్తుచేసి మంచిపని చేసారు. ఈ వారాంతము ఆ పని పూర్తిచేస్తాను.
బాగుంది శ్రీనివాస్. నాసైటు లో ఇంకా పనిచేయలేదు. ఎక్కడ పేస్టు చేయాలి.
Leave a reply