ఎన్ని వేల వర్ణాలో…
నేనొక శిలలా ఉంటే ఒడ్డున…
తానొక అలలా చేరెను చెంతన
ఆ పరిచయం ఓ ఉలిలాగ నన్నే తడిమింది…
ఈ రాయినే ప్రాణమున్న శిల్పంగా మలచింది
నాలో చలనం కలిగే వేళ తానెళ్లిపోయింది…
మరుపే ఎరుగని గురుతులు వదిలి మాయమయ్యింది
అది స్నేహమో… అనురాగమో… మమకారమో…
తెలియనితనమో… తేలనితనమో… కాలం చేసే మాయాజాలమో
తన కోసం ఈ ఎదురుచూపులు…
నా చిన్ని గుండెలో వేల నిట్టూర్పులు
7 Responses for "నేనొక శిల… తానొక అల…"
శిల => శిల్పం
అల => అల్పం!
బావుందండి.ఇంతే మరి తడిమిన తర్వాత,ఓర్చుకోండి
శ్రీనివాస్ గారు,
“తెలియనితనమో… తేలనితనమో… కాలం చేసే మాయాజాలమో” అన్నదక్కడ ఇమడలేదేమోని అనిపించింది. అదితప్ప మిగిలినదంతా మంచి అనుభూతితో బాగుంది.
అలానే తడిమిందీ, మలచిందీ, మాయమయ్యిందీ లో దీర్ఘాలు తీసెయ్యండి.
చాలా బాగుందండి.
దట్ల గారు మీ కవితలు చాల వినసొంపుగ ఉంటావి అంత అందంగ ఎల రాస్తరండి, కొంత ఉత్సాహం వస్తుంది మీ బ్లాగ్స్ చదువుతూ ఉంటే.
chala bagundhi
బావుందండి. కానీ ఈ మధ్య ఏమీ రాయటం లేదా!?. కొన్ని పాతవాటితోనే అగిపోయినట్టుంది.
ఏమీ అనుకోక పోతే శిల్పం అల్పం అన్న కామెంట్ కూడా నచ్చింది.కాతే శిల్పం గురించి చెప్పేంత తెలీదు.సో దానితో ఏకీభవిస్తున్నానని మాత్రం కాదు సుమండి!?.
Leave a reply