ఎన్ని వేల వర్ణాలో…
అంతా రండి… ప్రేమికుల దినాన్ని జరుపుకుందాం…
పూల మనసులని తుంచెయ్యడానికి ఒక రోజు దొరికింది మనకు
రంగు కార్డులను పంచుకోడానికి ఒక రోజు వచ్చింది మనకు
అంతా రండి… ప్రేమికుల దినాన్ని జరుపుకుందాం…
పార్కులన్నిటిని పావనం చెయ్యడానికి ఒక రోజు దొరికింది మనకు
కుర్ర హార్మోన్లు పండగ చేసుకోడానికి ఒక రోజు వచ్చింది మనకు
అంతా రండి… ప్రేమికుల దినాన్ని జరుపుకుందాం
ఏడాదిలో ఒక రోజుని బూజు పట్టకుండా చూసుకుందాం
వేలంటైన్‌కు సంబంధించిన తత్ దినాన్ని గుర్తుచేసుకునే ఈ దినాన ఎందుకో ఇది రాయాలనిపించింది నాకు.
ఇన్నాళ్ళూ కుర్రకారే అనుకున్నాను ఇప్పుడు ముసలోళ్ళూ ఈ జపమే చెయ్యడం చూస్తుంటే నవ్వొస్తుంది.
ఈ సమయంలో సీతారామశాస్త్రి “చిరునవ్వుతో” సినిమాకు రాసిన పాటను గుర్తుచేసుకోవడం సముచితం. నేను, నా స్నేహితుల స్వానుభవాలు ఇందులో చాలావరకు నిజమేనని నిరూపించాయి.
( ఈ పాట కాపీరైటు హక్కులు అన్నిన్నూ ఆ సినిమాకు సంభందించిన వాళ్ళకే చెందుతాయని ఈ బ్లాగ్ ముఖంగా తెలియజేసుకుంటున్నాను
)
నిన్నలా మొన్నలా లేదురా ఇవాళ కాలమే స్పీడుగ ఉందిరా
అన్నిట అంతటా తొందర; రొమాన్సు పద్దతే మారిపోయిందిరా
ఇల్లు చూసి సెల్లుఫోను బిల్లు చూస్తేనే భామ చూసి నవ్వుతుందిరా
ఇంగిలీషు భాషలోనే ప్రేమిస్తేనే ఆమె నిన్ను మెచ్చుతుందిరా
ప్రేమంటే అర్థం అంతా ఐలవ్యూలో లేదయ్యో
గుండెల్లో భావం మొత్తం గ్రీటింగ్ కార్డే కాదయ్యో
మనసంటూ మరోటంటూ అతిగా ఫీలైపోకమ్మా
మజునూలా ఇదైపోతూ ఫోజెందుకు మామా
విరహాలు వియోగాలు బీసీనాటి సరంజామా
వీ ఛానల్ రోజుల్లో అవి నీకవసరమా
లవ్వుకూ లైఫుకీ లింకు పెట్టుకుందుకీ దేవదాసు రోజులా ఇవీ
రోమియో జూలియట్ లాగ చావడానికి సిద్దపడ్డ ప్రేమలా ఇవీ
కేషుంటే ఖరీదైన బహుమానాలే కొనిపెట్టు
క్లుప్తంగా పనైపోయే మార్గం కనిపెట్టు
టైముంటే అదేపనిగా మాటల్తో మతిపోగొట్టు
లేకుంటే అయామ్‌సారీ మంత్రం సరిపెట్టు
కాగితం పూలకి అంటుకున్న సెంటురా నేటి కొత్త ప్రేమ ఫార్మ్యులా
జీవితం స్కేలులో చిన్న సెంటిమెంటురా అంతకన్న సీనులేదురా
2 Responses for "ప్రేమికుల దినం"
chakkaga chepparu!! indulo tappemi ledu..
Hi Sir,
Trend marindi antunnamu but andulo manchi teesukoni cadu vadilitey manchidi,Kani ippdu andaru chadu kosam yeduru choostunnaru,Chaduvukunnavallu andaram manchi ni vupayogiddam ani na chinna salaha.
Leave a reply