మరపు రాదేల!

రాసినవారు శ్రీనివాస on Tuesday, 20 of May , 2008 at 12:52 pm

మరుపు రాదేల ఈవేళ! ఇంతకు ముందు వరకూ ఏదన్నా గుర్తుకుతెచ్చుకున్నప్పుడల్లా మరుపు లేకపోవడం ఒక వరమనే అనుకునే వాడిని. ఇప్పుడు అదే ఎందుకు శాపమయ్యింది?

జీవితంలో ఒకరిని మరిచిపోవడం ఎంత కష్టమో ఇప్పుడర్థం అవుతుంది. ఎప్పుడూ కళ్ళ ముందు మెదిలే నువ్వు, గలగలమంటున్న నీ నవ్వు ఒక్కసారిగా  స్మృతిపథంలో కనబడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? మెదడులో ఎక్కడ నీ ఆనవాళ్ళు నిక్షిప్తమయి ఉన్నాయో తెలిసేదెలా? ఏ పరాకులో ఉన్నప్పుడు ఎడబాటుని తలచానో గానీ పై నుండి తథాస్తు దేవతలు దీవించినట్టున్నారు?!  అందుకే ఈ గుండె కోత.
నిన్ను  మరచిపోలేకపోతున్నందుకు నా మీద నాకే కోపం. ఎవరెన్ని చెప్పినా ఈ మనసుకు పట్టడం లేదు. ఏకాంతంలో నీ ఆలోచనలు వైతరిణీ ఒడ్డుకు తీసుకెళ్ళి వదిలేస్తున్నాయి.

బంధాలను తెంచుకోవడం ఎంత కష్టమో ఇప్పుడు తెలిసింది. నీలా ఒక్క క్షణంలో తనవారిని పరాయివారిలా మార్చెయ్యడం నాకు చేతకావడం లేదు. శిలని శిల్పంగా మలచింది ఎవరికో పణంగా పెట్టడం కోసమని నీకోసం కాదని తెలుసుకోలేకపోయిన అజ్ఞానిని నేను. నీ తలపుల నుండి తప్పించుకోవాలని శతవిధాల వృధా ప్రయత్నం.  ఏదో ఆశ; ఒక్క నిమిషమైనా నీ ఆలోచనల నుండి దూరంగా పోవాలని.
మధుపాత్రలు ఒంటిని చిధ్రం చేస్తున్నాయి గానీ మనసును శాంతింపజెయ్యడం లేదు.
కళ్ళుమూసుకున్నంత మాత్రాన నిదుర కౌగిలించుకోదుగా!

ఇక ఈ అజాత శత్రువుకు ఈ ప్రపంచంలో ముగ్గురు శత్రువులు…
కంటి ముందు మెదిలే నీ రూపు
చెవిలో ఇల్లు కట్టుకున్న నీ మాట
ఎదలో కదలాడుతున్న నీ తలపు
వాటిని జయించగలుగుతానో… వాటి చేతిలో దహించబడతానో వేచి చూడాలంటావా!

RTS Perm Link

వర్గములు: మనోగతం, స్వగతం

6 అభిప్రాయాలు

వికటకవి యొక్క అభిప్రాయము

Made Tuesday, 20 of May , 2008 at 3:10 pm

ఓహో కవితాత్మ పుట్టినరోజు సాక్షిగా పొంగుకొచ్చినట్లుందే. బాగుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు.

రామకృష్ణా యొక్క అభిప్రాయము

Made Wednesday, 21 of May , 2008 at 2:16 am

చాల బాగుంది…..ఒక సారి అనిపిస్తుంధి ఇది అందరి జీవితంలొ జరుగుతుందని

జ్యోతి యొక్క అభిప్రాయము

Made Wednesday, 21 of May , 2008 at 3:26 am

తప్పకుండా జయించగలవు . నువ్వు నిజంగా మరిచిపోవాలనుకుంటేనే సుమా..

విహారి యొక్క అభిప్రాయము

Made Wednesday, 21 of May , 2008 at 7:22 am

శ్రీనివాసా,

పుట్టిన రోజు వేళ ఏలనయ్యా తలపు హాయిగా పుట్టిన రోజు సంబరాన్ని జరుపుకొని సంతసించక.

పుట్టిన రోజు శుభాకాంక్షలు.

ఈతెలుగు కార్యవర్గ సభ్యులైనందుకు మళ్ళీ శుభాకాంక్షలు.

– విహారి

vissu యొక్క అభిప్రాయము

Made Thursday, 22 of May , 2008 at 11:17 pm

nice one chaalaaa bagundi andi
belated gaa many many happy returns of the day

Anonymous యొక్క అభిప్రాయము

Made Wednesday, 4 of June , 2008 at 5:20 am

nenu

అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

My Photoపేరు: శ్రీనివాసరాజు దాట్ల వృత్తి: 'పోకిరి' సినిమాలో బ్రహ్మానందం చేస్తాడే అది :) స్వస్థలం: వైశాఖపట్టణం నివాసం: సౌభాగ్యనగరం

చైత్రం నాది, శిశిరం నాది, వెలుగు నాది, చీకటి నాది, కష్టం నాది, సుఖం నాది, నవ్వు నాది, ఏడుపు నాది, అచ్చ తెలుగులో ప్రతి అనుభూతీ నాది.