ఎన్ని వేల వర్ణాలో…
ఈ రోజు హైదరాబాదులో జరిగిన పుస్తక ప్రదర్శనలో e-తెలుగు ఏర్పాటుచేసిన స్టాలులో మధ్యాహ్నం నుండి నేను కూడా ఉన్నాను. మేము కరపత్రాలు పంచాము. చాలా మంది ఆశక్తి చూపించారు. వాళ్లలో కొందరు కంప్యూటర్లో తెలుగు కనిపించాలంటే డబ్బిచ్చి ఏదన్నా సాఫ్ట్వేర్ కొనుక్కోవాలేమో, దానికోసమే మేము అక్కడ ఉన్నామేమో అనే అపోహలో ఉన్నారు. మేము వాళ్ల సందేహాలు తీరుస్తూవచ్చాం. తెలుగు బ్లాగరులు కూడా ఎక్కువే వచ్చారు (అంటే నా దృష్టిలో ప్రతినెలా సమావేశానికి వచ్చేవారికన్నా ఎక్కువ అని). సాయంత్రం ఆరు గంటలు దాటాకా e-తెలుగు సంఘం ప్రదర్శన ప్రారంభమయ్యింది. ప్రదర్శనలో భాగంగా కంప్యూటర్లో తెలుగు ఎనేబుల్ చెయ్యడం ఎలా? బ్లాగంటే ఏమిటీ? బ్లాగుని ఎలా సృష్టించుకోవాలి? ప్రస్తుతం ఉన్న కొన్ని బ్లాగుల వివరాలు, వికీపీడియా గురించి, ఈమాట, పొద్దు లాంటి వెబ్ పత్రికల గురించి, వివిధ వెబ్సైట్ల స్థానికీకరణ గురించి చెప్పి ఆ విషయాలనే వీడియో రూపంలో చూపించడం జరిగింది. ఒకటో రెండో టీవీ ఛానళ్ల వాళ్ళు కార్యక్రమాన్ని వీడియో తీసుకున్నారు. పత్రికల వాళ్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పనుల హడావిడిలో పడి అక్కడకు వచ్చిన మిగిలిన బ్లాగరులతో మాట్లాడటం కుదరలేదు. ముఖ్యంగా అక్కడకు వచ్చిన కొందరు మహిళా బ్లాగరుల పేర్లు తెలియదు
. అందుకే ఈ జాబులో ఎవరి పేరూ ప్రస్తావించకుండా కేవలం బ్లాగర్లు అని సంభోదిస్తున్నాను. ఎవరూ ఏమీ అనుకోకండేం. ఇక్కడ నా అనుభవాలను, అనుభూతులను ఒక బ్లాగరుగా రాసున్నానంతే. మరిన్ని వివరాలకు త్వరలో e-తెలుగు నుండి వచ్చే టపాలో చూడండి.
మరో రెండు ముఖ్య విశయాలు:
* నిన్ననే రావు వేమూరి గారి బ్లాగులో తెలుగు ఎందుకు? అన్న టపాలో “మనకి నిజానికి కావలసినది ప్రాచీన హోదా కాదు – ఆధునిక హోదా కావాలి” అన్న మరువమ్ము*ని చదివాను. e-తెలుగు ప్రదర్శనలో మాట్లాడుతూ ఈ మాటని కూడా మనవాళ్లు ప్రస్తావించారు. కార్యక్రమం అయ్య్యాక స్టాలు వద్దకి సినీరచయిత జే.కే భారవి గారు వచ్చి “ఆధునిక హోదా రావాలి అని మీరన్న మాట అదిరింది” అని సంతోషిస్తూ వెళ్ళారు.
* ప్రముఖ ఇంద్రజాలకులు, మానసిక వైద్య నిపుణులు బీవీ పట్టాభిరాం గారు వచ్చారు. ఆయనకి e-తెలుగు గురించి, ఇంటర్నెట్లో తెలుగు గురించి తోటి బ్లాగరులు వివరించారు.
కొసమెరుపు:స్టాలుకి వచ్చిన ఒకాయనకి కరపత్రం ఇచ్చాను. ఆయన కూడా ఉన్న ( ఆరు సంవత్సరాలు ఉండొచ్చు ) పిల్లాడికి కూడా ఇచ్చాను. ఆ పిల్లాడు పత్రంలోని తెలుగుని చూసి “డాడీ నాకు తమిళ్ రాదు” అంటూ తన తండ్రి వంక అయోయంగా చూసాడు. నాకప్పుడు తలని గోడకేసి “పేడ పేడ” అంటూ కొట్టుకోవాలనిపించింది.
మరువమ్ము: ఎవరన్నా ఏదన్నా ఒకమాట చెప్పారనుకోండి; ఆ మాట మనకి చాలా నచ్చిందనుకోండి; ఆకట్టుకున్నదనుకోండి; బాగా గుర్తుండేలా ఉందనుకోండి, ఆ మాటకి మరువమ్ము అని నా సొంత ప్రయోగం.

వేదిక మీద e-తెలుగు సభ్యులు/బ్లాగరులు

e-తెలుగు స్టాలు ముందర సభ్యులు/బ్లాగర్లు

e-తెలుగు స్టాలులో సభ్యులు/బ్లాగర్లు
21 Responses for "ఈ రోజు (e-)తెలుగు వెలుగులు"
“పేడ పేడ”
“పేడ పేడ”
సమావేశ వివరాలు చక్కగా అందించినందులకు ధన్య వాదాలు. సమావేశానికి వచ్చిన బ్లాగర్ల పేర్లు ఛాయా చిత్రాల కింద రాస్తే ఎవరెవరో అనే తెలుసుకునె వీలుండేది.
ఎంత కనువిందుగా ఉంది ఈ దృశ్యం! ముందే తెలిసుంటే డిసెంబరులో నా ఇండియా యాత్ర పెట్టుకొనే వాన్ని. కార్యక్రమం ఏ విఘ్నాలు లేకుండా దిగ్విజయంగా జరిగినట్లుంది. ఏ సమావేశంలో చూసినా మన దాట్ల శ్రీనివాస్ గారు క్రమం తప్పకుండా కనపడతారు. మీ బ్లాగోత్సానికి నా శుభాబినందనలు. నేనొచ్చి ఉంటే మన చదువరి గారి పొట్టకి ఘట్టి పోటీ ఇచ్చుండే వాణ్ణి:-)
ఫోటోలు బాగున్నాయి, రాసిన విధానం కూడా బాగుంది.
మరువమ్ము: పదం బాగుంది.
“తలని గోడకేసి “పేడ పేడ” అంటూ కొట్టుకోవాలనిపించింది”:(. ఆ తండ్రికి ఓ క్లాసు పీకకపోయారూ!
మంచి ప్రయత్నం . అభినందనలు
బావుంది నివేదిక. మిగతావారి సంగతి తెలీదు. మహిళా బ్లాగర్ల పేర్లు చెప్పడానికి మాకు( ప్రమదావనం సభ్యులు) ఇష్టం లేదు..
శ్రీనివాస,, చిన్నపిల్లాడి మాటలకే అంత విరక్తి ఐతే. నాకు తెలిసి హైదరాబాదులో పుట్టిపెరిగి, తెలుగువారైయుండి తెలుగు మాట్లాడ్డం రాని విద్యాధికులు ఉన్నారు. అప్పుడేం అంటావ్??
అవునూ , మీ అబ్బాయిలు , వచ్చేపోయే అమ్మాయిల మీద కామెంట్లు వేస్తున్నారని తెలిసింది. జాగ్రత్త. అచ్చతెనుగులో అష్టొత్తరం వినాల్సి వస్తుంది…..:):)
అందరికీ నెనరులు.
@వరూధిని,జ్యోతి గార్లకు
ఆ పిల్లాడి తండ్రి తనకు ఇచ్చిన కరపత్రాన్నే ఏదో ఇబ్బందిగా చూసినట్టనిపించింది. తమ చుట్టూఉన్న 99 శాతం మంది మారితే గానీ మారని ఆ ఒక్క శాతంలా కనిపించారు.
@జ్యోతిగారు
ఇలాంటి మాటంటారనే నేను అక్కడకు వచ్చే అమ్మాయిలకు దూరంగా ఉంటున్నాను.
నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను. ఇలాంటి చక్కని కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుందాము.
ఈ కార్యక్రమంలో పాల్గొనేవారందరికీ అభినందనలు…
కార్యక్రమం బాగా జరిగిన్ది. బ్లాగొత్సవంలొ నెను పల్గొవడం ఇదె మొదటిసారి. నెనెవరికి పరిచయం లెదు కాని మీ బ్లాగువీరులు,వీరనారీమనులు నాకు తెలుసు, కూదలిలొ మిమ్మల్ని చూడడమ్ లెదా “జల్లెడ” పట్టడమొ చెస్తుంటాను. నిన్న నాకు నిరాశ కలిగింది. నిర్వాహకులు తమని తాము పరిచయం చెసుకొని మిగతా బ్లాగుంపుని పరిచయం చెసుంటె బావుండెది. గ్రూప్ ఫొటొ బాగానె దిగారు కాని మీ రాతల్ని చూస్తున్న, చదువుతున్న నాలాంటి వారికి మిమ్మల్ని పరిచయం చెయకపొవడం బాగాలెదు. అందుకె నాకు నిరాశ….. ఎమంటారు?
ఈ కార్యం వెనుక వున్న వారందరికీ మనస్పూర్తిగా అభినందనలు. నాకు తెలిసి ఇప్పటిదాకా జరిగిన అన్ని ప్రయత్నాల కన్నా ఇది ఓ మెట్టు ఎక్కువే. ఇలాంటి ప్రదర్శనలకి స్వతహాగా భాషపై అభిమానమున్నవాళ్లు వస్తారు కాబట్టి, అటువంటి వారికి ఈ-తెలుగు కంప్యూటర్ లో తెలుగు ఉపయోగించడానికి తోడ్పడుతుందనడంలో సందేహం లేదు.
ఈ సదస్సు గురించిన మీ వివరణ చదుతున్నంత సేపూ నాకు చాలా ఆనందం కలిగింది….. చివరగా రాసిన “డాడీ నాకు తమిళ్ రాదు” అంటూ తన తండ్రి వంక అయోయంగా చూసిన” ఆ కుర్రాడి విషయం వరకు. ముందు తరంలో తెలుగు భాషకి ఇంకో తెలుగు వ్యక్తి దూరమయ్యిపోతున్నాడే అని బాధ కలిగింది.
నివేదిక చాలా బాగుందండి. జ్యోతి చెప్పినట్టు పెద్దవాళ్లే, బ్లాగుల్లో కూడా సగానికి సగం ఇంగ్లీషు వాడే వారుండగా, ఆరేళ్లపిల్లాడు తెలుగు చూసి తమిళం అన్నందుకు నవ్వుకోవాలంతే. మరువమ్ము –
నేను స్టాల్‌ని, అందరినీ మిస్ అయిపోయాను…
చ, నా బాడ్ లక్! నిన్న మీరంతా ప్రెజెంటేషన్ అదీ ఇదీ అని ఇరగదీస్తున్నపుడు నేను ఏడుపు మొహమేసుకుని మీకు దగ్గరలోనే(పత్రికల భాషలో..కూతవేటుదూరంలో) లుంబినీ పార్కు ముందు ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోయి ఉన్నాను, ఈ దృశ్యాలన్నీ ఊహించుకుంటూ! బయట పడే సరికి చా…లా సేప్పట్టింది. ఇక రాలేక వెళ్ళిపోయాను. అందుకే ఇవాళ వెళ్లా మన స్టాలుకు!
“అష్ట దుక్కుంభి కుంభాగ్రాలపై మన
తెనుఁగు ధ్వజము గ్రాల చూడవలదె!
గగన పాతాళ లోకాలలోని సమస్త
ప్రాణి కోటులు తెలుగు బ్లాగె వ్రాయవలదె!!
ఏ దేశమేగినా తె.బ్లా. ఆదేశముద్ర పడి
సంభ్రమాశ్చర్యాల జరుగవలదే!
‘హై హై తె.బ్లా.సం’ ‘జైహే తె.బ్లా.సం.’
అని దేవగురుడె కొండాడవలదె!!”
{చూ.ఘటోత్కచుడు from మాయాబజార్!}
@శ్రీనివాసరాజు దాట్ల గారు,
మీ నివేదిక చదువుతుంటేనే యింత ఆనందంగా ఉంటే, యిక అక్కడికి వచ్చి ఉంటే యింకెత ఆనందించి ఉండే వాడినో. రావడానికి నేను హైదరాబాదులో లేను మరి.
@ఇస్మాయిల్ గారు,
{చూ.ఘటోత్కచుడు from మాయాబజార్!} అదుర్స్ డాక్టరుగారూ.
kosamerupu maruvammu. photos baagunnaayi .
మీ అందరూ చెప్పేవి విని చాలా బాధగా ఉంది.. మీ అందరికీ ఇంత దూరంలో ఉండి.. ఇలాంటి ఆనందాలన్నీ మిస్ అవుతున్నందుకు
నా బదులు కూడా మీరే బాగా ఎంజాయ్ చేయండి.
మీ అందరికీ నా అభినందనలు.. ఎంతో శ్రమ తీసుకుని చక్కగా నిర్వహిస్తున్నందుకు.. అలాగే రాలేని మాలాంటి వాళ్ళకోసం కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నందుకు
మీకు స్పెషల్ థాంక్స్.. ఫొటోస్ కూడా పెట్టినందుకు
photos,pradarshana viravarana bagundhi……
Meeru rasina sarda vakyam ……Ade meeru mahila blogger la gurinchi prasthavinchadam…..daniki mahilalu paratispandinchadam bagundhi……
Srinivas gariki…naa abhinandanalu…
ఇక్కడ, మహేష్ ని అందరూ కలసి, ధభీ, ధభీ మని బాదుతూ ఉండే ఒక ఫోటో ఎక్స్ పెక్ట్ చేసానే…ఏమయింది అది, దాచేసారా?
చదువరి గారూ, అన్యాయం అండీ, మీరక్కడ ఉండి కూడా అలాంటి పని చేపట్టకుండా ఊరకుండిపోవడం!!
సూచన: సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎవరికైనా తగ్గితే, అది మీ ఖర్మే అని, నా మీద దండెత్తొద్దని మనవి.
namste. hyd book fair information bagundi. nenu bapatla-manasu blog open chesanu. kani poorthiga operation ardham kaledu..
Leave a reply