ఎన్ని వేల వర్ణాలో…

Archive for the ‘కవితలు’ Category


చెలీ నీ నుదుట బొట్టు..

Jun 19, 2011 Author: శ్రీనివాస | Filed under: కవితలు, సాంకేతికం

నేనామెను తొలిసారిగా చూసినప్పుడు అనుకున్నాను…
ఏమా సౌందర్యం…
ఏమా వినయం…
OOPS తను నాకే సోంతమవ్వాలని…

నేనా కాలేజీలో కంప్యూటర్ సైన్స్ విధ్యార్థిని…
మొన్నటివరకూ ఆమె నాతో ఆ వేపచెట్టుకింద…
ఈ రోజు ఇంకొకరితో అదే చెట్టుకింద నేనెవరో తెలియనట్టుగా…
ఇప్పుడర్ధమయ్యింది పాలీమార్ఫిజమంటే ఏమిటో…

తనను ఈ కాలేజీలో చేరినప్పటినుండి గమనిస్తున్నా…
ఎవరినీ పట్టించుకోకుండా; చాలా గుంభనంగా ఉంటుంది…
ఈ రోజు లుంబినీ పార్కులో చూసా తనని వేరొకరి ఒళ్ళో…
ఇప్పుడర్ధమయ్యింది ఎన్కేప్స్యులేషన్ అంటే ఏమిటో…

తను నాతో చాలా క్లోజ్‌గా ఉంటుంది…
అమ్మానాన్నల సంగతి చెప్పింది…
అక్కా చెల్లీ; అన్నా తమ్ముళ్ళ సంగతీ చెప్పింది…
మరి ఎవరినన్నా ప్రేమిస్తున్నావా అంటే మాత్రం చెప్పలేదు…
నువ్వే తెలుసుకోపో అంటూ ప్రహేళికనల్లింది…
అప్పుడర్థమైంది అబ్స్ట్రేక్షన్ అంటే ఏమిటో…

నాతో ఉన్నప్పుడు ఓ కన్నెపిల్లాలా…
స్నేహితురాళ్లతో ఉన్నప్పుడు ఓ కొంటెపిల్లలా…
తనవాళ్ళతో ఉన్నప్పుడు ఓ చిన్నపిల్లలా…
తను మారిపోతున్నప్పుడల్లా నాకనిపిస్తుంది…
డైనమిక్ బైండింగ్ అంటే ఏమిటో…

ఈ రోజు ఆ చిన్నది బొట్టు పెట్టుకోలేదు ఎందుకో…
నా మనసుకు వైధవ్యం ప్రాప్తించిందో ఏమిటో!

RTS Perm Link

యువరాజు మనోగతం 2

Feb 6, 2011 Author: శ్రీనివాస | Filed under: కవితలు, మనోగతం

ఆమె ఓ యువరాణి; యువ హృదయాలనేలు మహరాణి,
ఆమె పరిచారికల్ బ్రహ్మ ముహుర్తాన్నే బృందావనమున జొచ్చి…
లేసోయగాల పూబాలలన్ సేకరింతురే; యువరాణీ మదభీష్టమున్ నెరవేర్చి ఆమె కృపన్ పొందగా
ఆమె లేచునే మధువుల్ని పోసి పెంచిన పెరటి కోయిలల్ తొలిజాము ఆగమన వేళ కూయంగనే
ఆ మేనివిరుపుతో గగనాన సూరీడు రేనివురును దులిపి మేలుకొంటాడులే;
ఆ సైగ ఓ జోలపాటగా జాబిల్లిని నిద్దరోమని సెలవిచ్చినట్టుండులే…

స్నానవాటికకు తాను చేరంగనే తొట్టెలన్నీ పూబోడి జలమాయలే
మందారములతో తల అంటుకుని… తాను మల్లెపూరేకులతో జలకాలాడులే
తామరాకుల తుండు చేయందగా తాను మేనంత సున్నితముగా ఒత్తెలే
వేల సీతాకోకచిలుకల్ ముక్తినొందగా తమ రెక్కలన్నీ పోజేసి ఓణిగా నేసెలే!
రతియె ఆమె పాల పొంగును జూచి రవికెలా ఒదిగి ఒప్పారెలే

పద్మాలు చేరి తన పాదాన్ని తడమగా పాదుకలుగ అలంకృతమాయెలే!
నెమిలిభామలు వంతులేసుకుని మరీ తన పల్లకిగా పాదాల దరివాలెనే!
తెలిమంచు కరుగంగ పయనంబు సాగించి చేరుకొన్నాది తను నా ఇంటినే,
నేలేచు వేళ తాను నా ముందు నిలిచె నా పొద్దులన్నీ తన వశమవ్వగా…
….
….
….
….
ఇంతలో… గడియారం గంట కొట్టింది 🙂

RTS Perm Link

శ్రీనివాసీయం-3

Mar 14, 2010 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప, కవితలు

loneliness-tree
ఇన్నాళ్ళూ ఒంటరితనానికి ఏకాంతానికి తేడా తెలీని అమాయకుడను నేను…
ఇప్పుడు ఒంటరితనంలో చేదును రుచిచూసాకా…
మదిరలో తీయదనం ఎంతుందో తెలిసొచ్చింది 🙂

ప్రియా!
నువ్వూ నేనూ ధైవసన్నిధిలో పువ్వులమైపోయాం!
నువ్వు ఆ దేవుని పాదాలకి చేరువలో…
నేను నీ పాదాలకి చేరువలో…
ఇంతకీ ఎవరు ఎవరికి దేవుడు! ఎవరు ఎవరికి దేవత !

ఎప్పుడు కలుసుకున్నామో గుర్తురావడంలేదు!
ఏ వేశ్యావాటికలో నువ్వు తారసపడ్డావో…
ఏ క్షణికావేశంలో నేను నీ వశమయ్యానో…
మానసికమో; శారీరకమో… లోకంతో మనకి పనిలేదుగా…
నీ మససులోమాట చెప్పు చాలు… నా మనస్సాక్షి ఆశీర్వాదంతో నీకు సొంతమౌతాను…

ఒంటరితనం ఎంత చెడ్డదంటే…
శత్రువుతో అయినా నన్ను కూర్చుని భోంచెయ్యనివ్వు…
నన్ను ఉరితీయబోయే తలారితో అయినా నన్ను పరాచికాలాడనివ్వు…
కానీ నన్ను ఒంటరిగా ఒదిలెయ్యకు…
ఇలా జీవితకాలం ఒంటరిఖైదు కన్నా మరణశిక్షే మేలు నాకు!

నిన్న పుట్టిందీ మల్లెపువ్వు!
ఎన్ని తుమ్మదలు నేస్తాలో…
ఎన్ని సీతాకోకచిలుకలు చెలికత్తెలో…
ఈ రోజు వాడిపోయే వరకూ నవ్వుతూ బ్రతికింది…
ఛీ! నేనేంటి ఇలా దిగులుగా… నూరేళ్ళూ బ్రతకవలసినవాడిని!!!

నేనూ నా సహచరుడు…
తనో క్రిష్టియన్… నేనో హిందూ…
తనో తెలంగానియన్… నేనో ఆంద్రావాలా…
ఇద్దరం బానే కలిసుంటున్నాం కదా!…
మధ్యలో నువ్వెవడివిరా! విడిపోదాం… వేరుపడదాం అంటూ…

RTS Perm Link

ఎద లోతుల్లో ఒక మాటుంది…
నిన్ను కలుసుకుంటున్నప్పుడు… నీ నుండి విడిపోతున్నప్పుడు…
గుండెలో చెప్పలేని బరువు…
కళ్ళలో ఉప్పునీటి చెరువు…

(మరింత పెద్ద బొమ్మ కోసం ఈ బొమ్మ మీద క్లిక్ చెయ్యండి)

ఎద లోతుల్లో 01 (చిన్నది)

RTS Perm Link

RTS Mirror Widget


from JalleDa

పంచాంగం


Warning: fsockopen(): php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: fsockopen(): unable to connect to udp://whois.happyarts.net:8000 (php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known) in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: stream_set_timeout() expects parameter 1 to be resource, boolean given in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 125