ఎన్ని వేల వర్ణాలో…

Archive for the ‘వ్యంగ్యం’ Category


srinivaseeyam2
అనుభూతి…
మాటలకందదు… కానీ తలపుల్లో ఊపిరోసుకుంటుంది…
నువ్వెవరో నేనెవరో…
అసలు నువ్వు ఉన్నావో లేదో కదా!
అయినా ఇద్దరినీ మమేకం చేసేస్తుంది…
అథ్వైతానికి అర్థం చెబుతుంది.

వానైపోతున్నావా ఓ మేఘమా!
నీ చినుకుల చెణకులతో చెలిని తడమవా…
మా లోగిలిలోకి రెక్కలు కట్టుకుని వాలుతావా…
మా ఇంటి చూరుని పట్టుకుని వేలాడుతూ ఉండిపోతావా…
పోనీ పసిరికను చుంబిస్తూ ఉండిపో నేనొచ్చేదాకా…
నీ తడి స్పర్శలో నే వెతుక్కుంటాను… నేనిన్నాళ్ళూ పోగొట్టుకున్న సాంగత్యాన్ని…

కొవ్వొత్తి…
నిరాడంబరంగా చుట్టూ వెలుగుల్ని గుప్పిస్తుంది…
తనలో రగులుతున్న అగ్నిపర్వతాన్ని గుర్తించలేదు…
మరిగే ఒక్కో మైనపు బొట్టునూ స్పర్శించేదాకా…

నవ్వుతున్నప్పుడల్లా… ఒకటే భాద…
నవ్వలేని వాళ్ళని ఎలా నవ్వించాలా అని!
భాదలో ఉన్నవారిని చూస్తుంటే తెలిసొచ్చింది…
అయ్యొ! నేనెలా నవ్వగలుగుతున్నానా అని?

కాయితం…
రంగు పులుముకుని, పరిమళాన్ని పూసుకుని,
పువ్వులా ముస్తాబయ్యింది!!
ఎన్ని రోజులైనా వాడిపోలేని ఆయుష్షు తనది…
కానీ ఆ గడ్డిపువ్వులో తొణికిసలాడే తేజం కనిపించదేం?

వెన్నెల…
సూర్యుడిదా? చంద్రుడిదా?
ఏమో తెలీడం లేదు…
నువ్వున్నప్పుడు చల్లగా ఉంటుంది…
నువ్వెళ్ళినప్పుడు వెచ్చగా ఉంటుంది…
ఈ అజ్ఞానికి చెప్పేదెవరు?

అక్కా చెల్లీ తమ్ముడూ అన్నా మరదలూ వదినా బావా బామ్మరిదీ..
ఇంకొకటే చుట్టరికం మిగిలింది…
నువ్వౌతావా మరి 🙂

పెరట్లో గోరింట…
చెల్లి అరచేత చందమామైపోయింది…
నా తళ్ళో పిడకలా మారింది…
నేనిప్పుడు తన కన్నా పదేళ్ల చిన్నవాడిని….

చిత్రగుప్తుడు చిట్టా తిరగేసాడు…
నా నూకలింక చెల్లవని చెప్పేసాడు…
యముడేమో పాశమిదిలిస్తున్నాడు…
సఖీ సావిత్రీ నువ్వెక్కడ?

చిన్నపుడు చదివినట్టే…
ఇప్పుడూ చందమామనే చదువుతున్నాను…
పక్కాంటీ కూతురు చేసే సైగలందుకే అర్థం కావడం లేదట!
వారం వారం స్వాతి చదివే మా బామ్మ అంటుంది !!!

RTS Perm Link

ప్రేమికుల దినం

Feb 13, 2008 Author: శ్రీనివాస | Filed under: మనోగతం, వ్యంగ్యం

ప్రేమికుల దినంఅంతా రండి… ప్రేమికుల దినాన్ని జరుపుకుందాం…
పూల మనసులని తుంచెయ్యడానికి ఒక రోజు దొరికింది మనకు
రంగు కార్డులను పంచుకోడానికి ఒక రోజు వచ్చింది మనకు
అంతా రండి… ప్రేమికుల దినాన్ని జరుపుకుందాం…
పార్కులన్నిటిని పావనం చెయ్యడానికి ఒక రోజు దొరికింది మనకు
కుర్ర హార్మోన్లు పండగ చేసుకోడానికి ఒక రోజు వచ్చింది మనకు
అంతా రండి… ప్రేమికుల దినాన్ని జరుపుకుందాం
ఏడాదిలో ఒక రోజుని బూజు పట్టకుండా చూసుకుందాం

వేలంటైన్‌కు సంబంధించిన తత్ దినాన్ని గుర్తుచేసుకునే ఈ దినాన ఎందుకో ఇది రాయాలనిపించింది నాకు.
ఇన్నాళ్ళూ కుర్రకారే అనుకున్నాను ఇప్పుడు ముసలోళ్ళూ ఈ జపమే చెయ్యడం చూస్తుంటే నవ్వొస్తుంది.

ఈ సమయంలో సీతారామశాస్త్రి “చిరునవ్వుతో” సినిమాకు రాసిన పాటను గుర్తుచేసుకోవడం సముచితం. నేను, నా స్నేహితుల స్వానుభవాలు ఇందులో చాలావరకు నిజమేనని నిరూపించాయి.

( ఈ పాట కాపీరైటు హక్కులు అన్నిన్నూ ఆ సినిమాకు సంభందించిన వాళ్ళకే చెందుతాయని ఈ బ్లాగ్ ముఖంగా తెలియజేసుకుంటున్నాను 🙂 )

నిన్నలా మొన్నలా లేదురా ఇవాళ కాలమే స్పీడుగ ఉందిరా
అన్నిట అంతటా తొందర; రొమాన్సు పద్దతే మారిపోయిందిరా
ఇల్లు చూసి సెల్లుఫోను బిల్లు చూస్తేనే భామ చూసి నవ్వుతుందిరా
ఇంగిలీషు భాషలోనే ప్రేమిస్తేనే ఆమె నిన్ను మెచ్చుతుందిరా
ప్రేమంటే అర్థం అంతా ఐలవ్యూలో లేదయ్యో
గుండెల్లో భావం మొత్తం గ్రీటింగ్ కార్డే కాదయ్యో

మనసంటూ మరోటంటూ అతిగా ఫీలైపోకమ్మా
మజునూలా ఇదైపోతూ ఫోజెందుకు మామా
విరహాలు వియోగాలు బీసీనాటి సరంజామా
వీ ఛానల్ రోజుల్లో అవి నీకవసరమా
లవ్వుకూ లైఫుకీ లింకు పెట్టుకుందుకీ దేవదాసు రోజులా ఇవీ
రోమియో జూలియట్ లాగ చావడానికి సిద్దపడ్డ ప్రేమలా ఇవీ

కేషుంటే ఖరీదైన బహుమానాలే కొనిపెట్టు
క్లుప్తంగా పనైపోయే మార్గం కనిపెట్టు
టైముంటే అదేపనిగా మాటల్తో మతిపోగొట్టు
లేకుంటే అయామ్‌సారీ మంత్రం సరిపెట్టు
కాగితం పూలకి అంటుకున్న సెంటురా నేటి కొత్త ప్రేమ ఫార్మ్యులా
జీవితం స్కేలులో చిన్న సెంటిమెంటురా అంతకన్న సీనులేదురా

RTS Perm Link

కిరికెట్టు వీరుడు…

Mar 12, 2007 Author: శ్రీనివాస | Filed under: వ్యంగ్యం

Cricket-Ted.jpgఅదో క్రీడా మైదానం. అక్కడ ఓ పదిహేను మంది తెగ ఆడేస్తున్నామని ఫీలయిపోతుంటే ఓ పాతికవేలమంది దాకా పోగయి చూస్తుంటారు. చప్పట్లు, కేరింతలు, గోలగోల. పేడ్ హెల్మెట్ గ్లోవ్స్ కవచ ధారుడైన శ్రీమాన్ తన వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాడు. తను తప్పకుండా జట్టులో ఉండాలని పట్టు బట్టి తన స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసిన కెప్టెన్ ఓ పక్క; తనంటే పడని కోచ్ ఓ పక్క. చుట్టూ చూసాడొక్కసారి. పిచ్చి జనం తెగ గెంతుతున్నారు అని అనుకుంటూ ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు.

“అయ్యో అనవసరంగా ఆ కాంట్రాక్టు మీద సంతకం పెట్టేసానే! 150 కోట్లు కనిపించేసరికి ఇంకేమీ ఆలోచించలేదీ ఎదవ బుర్ర. మళ్ళీ ఐదేళ్ళ వరకూ అలాంటి కాంట్రాక్టు ఒప్పుకోకూడదు ఎలాగబ్బా. ఆ 250 కోట్లది ఏదో ముందే వస్తే బాగుండేది కదా! రేపటి గురించి ఆలోచిస్తుంటే ఒళ్ళు జలదరించిపోతుంది. పైగా ఒంట్లో ఎక్కడ కీలుంటే అక్కడ ఆపరేషన్ చేసి పడేసారు ఈ డాక్టర్లు. మేచ్ ఫిక్సంగ్ చెయ్యడానికి కూడా ఎవడూ ఒప్పుకోవడం లేదిప్పుడు” అని లోపల్లోపల బాదపడిపోతున్నాడు.ఇంతలో దూరంగా ఓ కూల్‌డ్రింక్ కటౌట్ కళ్ళబడింది. “హమ్మయ్య. ఇదొకటుంది కదా. ఈసారి ఎక్కువ రాబట్టుకోవాలి వీళ్ల దగ్గర్నుంచి. కొన్ని రోజుల క్రితం వరకు జనం హడావిడి చేశారు దీనిలో ఏదో పురుగుల మందు కలుపుతున్నారని. వీళ్ళకి దాహం వేస్తే నీళ్ళు తాగొచ్చుగా… ఇది తాగి నా కడుపెందుకు కొడుతున్నట్టో…”  అని అనుకుంటుండగా జనాల కేకలు మరీ ఎక్కువవడంతో మైదానంలోకి చూసాడు. ఎవడో ఔటయి వచ్చేస్తున్నాడు. అబ్బో తన వంతు వచ్చిందిప్పుడు. బద్దకంగా లేచాడు. కేప్టెన్ వచ్చి భుజం తట్టి పంపించాడు.

వెర్రాభిమానుల కోలాహలం మద్య రంగ ప్రవేశం చేసాడు. హెల్మెట్ దగ్గర నుండి బూట్ల వరకు అన్నింటి మీదా రకరకాల కంపెనీల లోగోలు. ఇప్పుడు తను ఓ ఆటగాడు కాదు. వివిధ రకాల ఉత్పత్తులకు ప్రకటనదారుడు. రకరకాలుగా వాటిని ప్రదర్శిస్తూ అప్పుడప్పుడూ ఒకటీ అరా పరుగులు తీస్తూ ఇంక ఓపిక లేక ఔటయిపోయాడు. అభిమానుల ఆశలను నీరగార్చానన్న భాద ఏ కోశానా కనిపంచడం లేదు శ్రీమాన్ ముఖంలో.

వచ్చి కుర్చీలో చతికిలపడిపోయాడు. హమ్మయ్య ఓ పనైపోయిది బాబూ అనుకుంటూ పక్కనే ఉన్న సెల్‌ఫోన్ అందుకున్నాడు. అందులో ఓ ‘మిస్’డ్ కాల్ కనిపించింది. టైం చూసాడు. ఇంత క్రితమే వచ్చినట్టుంది. “డామిట్! నగ్మా కాల్ చేసింది. ఛ మిస్సయ్యానే. ఆడు పట్టుకున్న కేచేదో ముందే పట్టేసుకుని ఉండొచ్చుకదా.” అని అనుకుంటూ బుర్రపట్టుకున్నాడు దిగులుగా. 

RTS Perm Link

RTS Mirror Widget


from JalleDa

పంచాంగం


Warning: fsockopen(): php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: fsockopen(): unable to connect to udp://whois.happyarts.net:8000 (php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known) in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: stream_set_timeout() expects parameter 1 to be resource, boolean given in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 125