ఎన్ని వేల వర్ణాలో…

Archive for the ‘సాంకేతికం’ Category


చెలీ నీ నుదుట బొట్టు..

Jun 19, 2011 Author: శ్రీనివాస | Filed under: కవితలు, సాంకేతికం

నేనామెను తొలిసారిగా చూసినప్పుడు అనుకున్నాను…
ఏమా సౌందర్యం…
ఏమా వినయం…
OOPS తను నాకే సోంతమవ్వాలని…

నేనా కాలేజీలో కంప్యూటర్ సైన్స్ విధ్యార్థిని…
మొన్నటివరకూ ఆమె నాతో ఆ వేపచెట్టుకింద…
ఈ రోజు ఇంకొకరితో అదే చెట్టుకింద నేనెవరో తెలియనట్టుగా…
ఇప్పుడర్ధమయ్యింది పాలీమార్ఫిజమంటే ఏమిటో…

తనను ఈ కాలేజీలో చేరినప్పటినుండి గమనిస్తున్నా…
ఎవరినీ పట్టించుకోకుండా; చాలా గుంభనంగా ఉంటుంది…
ఈ రోజు లుంబినీ పార్కులో చూసా తనని వేరొకరి ఒళ్ళో…
ఇప్పుడర్ధమయ్యింది ఎన్కేప్స్యులేషన్ అంటే ఏమిటో…

తను నాతో చాలా క్లోజ్‌గా ఉంటుంది…
అమ్మానాన్నల సంగతి చెప్పింది…
అక్కా చెల్లీ; అన్నా తమ్ముళ్ళ సంగతీ చెప్పింది…
మరి ఎవరినన్నా ప్రేమిస్తున్నావా అంటే మాత్రం చెప్పలేదు…
నువ్వే తెలుసుకోపో అంటూ ప్రహేళికనల్లింది…
అప్పుడర్థమైంది అబ్స్ట్రేక్షన్ అంటే ఏమిటో…

నాతో ఉన్నప్పుడు ఓ కన్నెపిల్లాలా…
స్నేహితురాళ్లతో ఉన్నప్పుడు ఓ కొంటెపిల్లలా…
తనవాళ్ళతో ఉన్నప్పుడు ఓ చిన్నపిల్లలా…
తను మారిపోతున్నప్పుడల్లా నాకనిపిస్తుంది…
డైనమిక్ బైండింగ్ అంటే ఏమిటో…

ఈ రోజు ఆ చిన్నది బొట్టు పెట్టుకోలేదు ఎందుకో…
నా మనసుకు వైధవ్యం ప్రాప్తించిందో ఏమిటో!

RTS Perm Link

అను స్క్రిప్ట్ మేనేజర్ (6,7 వెర్షన్లు) ఉపయోగించి తెలుగులో టైప్ చేసిన, టెక్స్ట్ ఫార్మాటులో ఉన్న ఫైళ్ళను యూనీకోడులోకి మార్చే ఆన్‌లైన్ కన్వర్టర్ రూపొందించబడింది.

http://anu2uni.harivillu.org

ఈ ఉపకరణాన్ని Unigateway లోని ముఖ్య  ఫైళ్లను ఉపయోగించుకుంటూ,  అను 7 కి కూడా సపోర్ట్  జతచేసి తయారుచేసాను.   Unigateway అనేది ఫైర్‌ఫాక్స్ పద్మ పొడిగింతను phpలో రాసినది. దీనిని http://uni.medhas.org సైటులో హోస్ట్ చేసారు. దానిలో వివిధ ఫాంట్లలో టైప్ చేసిన పత్రాలను యూనీకోడులోకి మార్చడానికి ఒక ఉపకరణం ఉంది కానీ అను 6 కి మాత్రమే సపోర్టు ఉంది.

RTS Perm Link

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ పంచాంగం ఖగోళానికి సంభందించిన వివిధ గణిత సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది. మీ విహరిణిలో ఉన్న టైమ్‌జోన్‌ని గ్రహించి మీ ప్రాంతానికి తగిన సమయాన్నిబట్టి పంచాంగాన్ని చూపిస్తుంది.  దీనిలో చూపించే సమయాల్లో కొన్ని నిమిషాలు అటూ ఇటూ ఉండవచ్చును. ముందు ముందు మరింత సమాచారం ఈ పంచాంగంలో చేర్చడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి మీరు ఈ జావాస్క్రిప్ట్ కోడుని తీసుకుంటే తర్వాత జతచేసే ఫీచర్‌ల కోసం మీరు కోడుని తాజీకరించుకోనక్కర్లేదు.  ఎప్పుడు జతచేసిన ఫీచర్ అప్పుడే మీ సైటు/బ్లాగులో దర్శనమిస్తుంది.
ఇక ముందుముందు పండుగలు, పర్వదినాలు లాంటివి జత చేస్తాను. ఈ పంచాంగం విడ్జెట్‌ను ఎవరైనా ఏ బ్లాగులోనైనా వెబ్‌సైటులోనయినా ఉంచవచ్చు.

ముందుగా పంచాంగం కోడుని పొందండి

ముందుగా మీరు http://plugins.harivillu.org/panchangam సైటుకి వెళ్లి అక్కడ ఉన్న వివిధ ఎంపికల ద్వారా మీకు ఇష్టమైనట్టు పంచాంగాన్ని తయారుచేసుకోండి. తర్వాత ఈ క్రింది కనిపిస్తున్న విద్దంగా కోడుని కాపీ చేసుకోండి.

001

బ్లాగరులో పంచాంగం

బ్లాగరు ఖాతాలోకి ప్రవేశించిన తర్వాత పంచాంగం ఉంచవలసిన బ్లాగు తాలూకూ లేఅవుట్‌లోకి వెళ్ళండి. లేఅవుట్‌లో కుడివైపున కనిపించే గాడ్జెట్‌ను చేర్చు అన్న లంకెను నొక్కితే మీకు ఈ క్రింది విదంగా ఒక విండో కనిపిస్తుంది. అందులో ఉన్న HTML/Javascript ని “+” ని నొక్కి జత చేయండి.
004

ఆపై వచ్చే విండోలో క్రింది కనిపించే విధంగా కోడుని అతికించి సేవ్ చెయ్యండి. ఆపై లేఅవుట్‌ని సేవ్ చేయండి.

005

వర్డ్‌ప్రెస్‌లో పంచాంగం

వర్డ్ప్రెస్‌లోకి లాగిన్ అయ్యాకా ఎడమ వైపున ఉన్న Appearance లో ఉన్న Widgetని క్లిక్ చెయ్యండి. తర్వాత వచ్చే పేజీలో ఉన్న Available Widgets లోంచి Text విడ్జెట్‌ని ఎంచుకోండి

002

Text విడ్జెట్‌ని Add చేసాకా అది కుడి వైపుకు కలపబడుతుంది. అక్కడ నుండి దాన్ని Edit చెయ్యవచ్చు. ఈ క్రింది కనిపించే విదంగా మీరు పంచాంగం కోడుని కలపవచ్చు. ఆపై Save Changes నొక్కితే సరి!

003

ఇతర వెబ్‌సైట్‌లలో పంచాంగం

మీకు HTML ఒంటబట్టినట్టయితే మీ వెబ్‌పేజీలో ఎక్కడ కావాలంటే అక్కడ మీరు పంచాంగాన్ని ఉంచవచ్చు. మీరు పైన పొందిన పంచాంగం కోడుని మీకిష్టమైన చోట ఉంచండి చాలు!.

మునుముందు తాజాకరణల కోసం

మునుముందు జతచేసే తాజాకరణలను మీకు తెలియజేయడానికి ఈ క్రింది కనిపిస్తున్నట్టు  http://plugins.harivillu.org/panchangam లో ఉన్న ఫారం‌ను నింపి సమర్పించండి.

006

లోకా: సమస్తా: సుఖినో భవంతు! ఓం శాంతి: శాంతి: శాంతి:

మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియజెయ్యండి.

RTS Perm Link

శ్రీ శోధన ప్లగ్‌ఇన్

Jan 23, 2008 Author: శ్రీనివాస | Filed under: సాంకేతికం

మీలో ఎవరైనా thefreedictionary.com సైటుకు వెళ్లుంటే అక్కడ ఉన్న ఒక వెసులుబాటు తెలుసుంటుంది. ఆ వెబ్‌పేజీ మీద కనిపించే ఏ పదాన్నయినా డబుల్‌ క్లిక్ చేసినప్పుడు ఆ పదానికి అర్థం ఉన్న వెబ్‌పేజీ తెరచుకుంటుంది. దాన్ని చూసినప్పుడు కలిగిన ఆలోచనకు ప్రతి రూపమే ఈ శ్రీ శోధన ప్లగ్‌ఇన్. ఇది పూర్తిగా జావాస్క్రిప్ట్‌లో రాయబడింది. యూనీకోడ్ సపోర్టు ఉంది. జావాస్క్రిప్ట్ కోడ్ జోడించడానికి వీలున్న ఏ వెబ్‌పేజీలోనయినా దీనిని ఉపయోగించవచ్చు. మీరు చెయ్యవలసిందల్లా…

<script src=”http://harivillu.org/plugins/srisodhana.js”></script> ని మీ వెబ్‌పేజీలో ఉంచడమే.  ( ప్రస్తుతం దీన్ని పాటిస్తే మంచిది; ఎందుకంటే దీనిని మరింత క్రియాత్మకంగా చేయవలసి ఉంది. కాబట్టి ముందు ముందు ఏమన్నా మెరుగుపరిస్తే అది మీ సైట్‌లలో వెంటనే ప్రతిఫలిస్తుంది ).

లేదా

srisodhana.js ఫైలును మీ సైటులోకి ఎగుమతి చేసుకుని దానిని ఉపయోగించుకోవచ్చు.

ప్రస్తుతం ఇది ఐఈ, ఫైర్‌ఫాక్స్, నెట్‌స్కేప్‌లలో పనిచేస్తుంది. ఒపేరాలో డబుల్‌క్లిక్ ఈవెంట్‌ని స్వంత పాప్‌అప్ కోసం ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఇది పనిచేయదు.

srisodhana-ss01.gif

ఈ ప్లగిన్ వలన ఉపయోగమేమంటే మీరు ఏదన్నా పదం మీద డబుల్‌క్లిక్ చేసినప్పుడు ఒక చిన్న పాప్‌అప్‌ని చూపిస్తుంది. దానిలో మీకు తెవికీ, గూగులమ్మ, బ్రౌను అని మూడు ఎంపికలు కనిపిస్తాయి.  వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. వాటి కింద మీరు డబుల్‌క్లిక్కిన పదానికి అక్షరాలు తగ్గిస్తూ ఉన్న మరికొన్ని పదాలకు లింకులు కనిపిస్తాయి. మీకు కావలసిన పదం మీద క్లిక్కితే మీరు పైన ఎంచుకున్న సైటులో ఆ పదం తాలూకు పేజీని తెరుస్తుంది.

ఈ బ్లాగులోనే మీరు డెమో చూడొచ్చు. ఏదన్నా పదం మీద డబుల్‌క్లిక్ చెయ్యండి మరి.

RTS Perm Link

RTS Mirror Widget


from JalleDa

పంచాంగం


Warning: fsockopen(): php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: fsockopen(): unable to connect to udp://whois.happyarts.net:8000 (php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known) in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: stream_set_timeout() expects parameter 1 to be resource, boolean given in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 125