ఎన్ని వేల వర్ణాలో…

Archive for the ‘కవితలు’ Category


నేనొక శిల… తానొక అల…

Jan 27, 2008 Author: శ్రీనివాస | Filed under: కవితలు, స్వగతం

నేనొక శిలలా ఉంటే ఒడ్డున…
తానొక అలలా చేరెను చెంతన

ఆ పరిచయం ఓ ఉలిలాగ నన్నే తడిమింది…
ఈ రాయినే ప్రాణమున్న శిల్పంగా మలచింది

నాలో చలనం కలిగే వేళ తానెళ్లిపోయింది…
మరుపే ఎరుగని గురుతులు వదిలి మాయమయ్యింది

అది స్నేహమో… అనురాగమో… మమకారమో…
తెలియనితనమో… తేలనితనమో… కాలం చేసే మాయాజాలమో

తన కోసం ఈ ఎదురుచూపులు…
నా చిన్ని గుండెలో వేల నిట్టూర్పులు

RTS Perm Link

సారీ అభిషేక్

Mar 6, 2007 Author: శ్రీనివాస | Filed under: కవితలు
aish01.jpgఅది స్మయిలా లేక మదనుడు వదిలిన మిస్సయిలా… నా హార్టే మిస్సయిపోయిందే చెలియా…        

అది స్టయిలా లేక మనసుని దోచే తాజ్‌మహలా… నా రూటే మారిపోయిందే సఖియా…

aish02.jpg
రిమోట్‌ కంట్రోల్‌ నీ కళ్ళు…   

నీ కంటి చోపులే సిగినల్లు…

నువు కన్ను కదిపినా అది చాలు…

మా హార్ట్‌బీటే గోల్‌మాలు.

సారీ అభిషేక్. ఇవి నీకు ఐష్‌తో పెళ్ళి కుదరకముందు రాసుకున్నవి. సల్మాన్‌ని క్షమించినట్టే నన్నూ వదిలెయ్ ;)

RTS Perm Link

కలగూరగంప-1

Feb 27, 2007 Author: శ్రీనివాస | Filed under: కవితలు

Gampa01.jpgకన్నీటి చెలమలలో కష్టాల నేస్తాలు సేదతీరేలా పొగిలి పొగిలి ఏడ్చేస్తాను…
తిష్టేసి కూర్చున్న బాదల చుట్టాలు పారిపోయేలా పగలబడి నవ్వేస్తాను…

****

నా వెనక గోతులు తీసేవాళ్ళను చూస్తే జాలి…
పడిపోతారేమో వాటిలో పాపం వాళ్ళే ఖర్మకాలి…
నా ముందు నీతులు చెప్పేవాళ్ళను చూసినా జాలే…
ఏమౌతారో వాళ్ళు చెప్పినవి పాటించాల్సి వస్తే వాళ్ళే…

****

మా నాన్న చదివెన్ ఏడో తరగతి…
మా అమ్మ చదివెన్ మూడో తరగతి…
మొత్తానికి ఇద్దరూ కలిసి పూర్తిజేసెన్ పదోతరగతి… 

****

తాత విత్తు నాటి నీరు పోసాడు…
నాన్న కాపు కాసి మొక్క పెంచాడు…
కొడుకు నీడ కోరి చెట్టు చేరాడు…
ఎవడో కబ్జాదారుడు ఆ సరికే సేదతీరుతున్నాడు… 

****

అందరూ వదిలిపోయారు నన్ను…
నేను ఏకాకిని ఇప్పుడు…
తల్లి, తండ్రి, చెల్లి, ఆలి…
హితులూ, స్నేహితులూ, బందువులూ…
నిర్ధాక్షిణ్యంగా, నిర్వేదంగా…మూకుమ్మడిగా…
ఈ ఆరడుగుల సామ్రాజ్యానికి నన్ను రాజుని చేసి వెళ్ళిపోయారు…
నేను ఏకాకిని ఇప్పుడు… 

RTS Perm Link

RTS Mirror Widget


from JalleDa

పంచాంగం