ఎన్ని వేల వర్ణాలో…

Archive for the ‘మనోగతం’ Category


ప్రేమికుల దినం

Feb 13, 2008 Author: శ్రీనివాస | Filed under: మనోగతం, వ్యంగ్యం

ప్రేమికుల దినంఅంతా రండి… ప్రేమికుల దినాన్ని జరుపుకుందాం…
పూల మనసులని తుంచెయ్యడానికి ఒక రోజు దొరికింది మనకు
రంగు కార్డులను పంచుకోడానికి ఒక రోజు వచ్చింది మనకు
అంతా రండి… ప్రేమికుల దినాన్ని జరుపుకుందాం…
పార్కులన్నిటిని పావనం చెయ్యడానికి ఒక రోజు దొరికింది మనకు
కుర్ర హార్మోన్లు పండగ చేసుకోడానికి ఒక రోజు వచ్చింది మనకు
అంతా రండి… ప్రేమికుల దినాన్ని జరుపుకుందాం
ఏడాదిలో ఒక రోజుని బూజు పట్టకుండా చూసుకుందాం

వేలంటైన్‌కు సంబంధించిన తత్ దినాన్ని గుర్తుచేసుకునే ఈ దినాన ఎందుకో ఇది రాయాలనిపించింది నాకు.
ఇన్నాళ్ళూ కుర్రకారే అనుకున్నాను ఇప్పుడు ముసలోళ్ళూ ఈ జపమే చెయ్యడం చూస్తుంటే నవ్వొస్తుంది.

ఈ సమయంలో సీతారామశాస్త్రి “చిరునవ్వుతో” సినిమాకు రాసిన పాటను గుర్తుచేసుకోవడం సముచితం. నేను, నా స్నేహితుల స్వానుభవాలు ఇందులో చాలావరకు నిజమేనని నిరూపించాయి.

( ఈ పాట కాపీరైటు హక్కులు అన్నిన్నూ ఆ సినిమాకు సంభందించిన వాళ్ళకే చెందుతాయని ఈ బ్లాగ్ ముఖంగా తెలియజేసుకుంటున్నాను :-) )

నిన్నలా మొన్నలా లేదురా ఇవాళ కాలమే స్పీడుగ ఉందిరా
అన్నిట అంతటా తొందర; రొమాన్సు పద్దతే మారిపోయిందిరా
ఇల్లు చూసి సెల్లుఫోను బిల్లు చూస్తేనే భామ చూసి నవ్వుతుందిరా
ఇంగిలీషు భాషలోనే ప్రేమిస్తేనే ఆమె నిన్ను మెచ్చుతుందిరా
ప్రేమంటే అర్థం అంతా ఐలవ్యూలో లేదయ్యో
గుండెల్లో భావం మొత్తం గ్రీటింగ్ కార్డే కాదయ్యో

మనసంటూ మరోటంటూ అతిగా ఫీలైపోకమ్మా
మజునూలా ఇదైపోతూ ఫోజెందుకు మామా
విరహాలు వియోగాలు బీసీనాటి సరంజామా
వీ ఛానల్ రోజుల్లో అవి నీకవసరమా
లవ్వుకూ లైఫుకీ లింకు పెట్టుకుందుకీ దేవదాసు రోజులా ఇవీ
రోమియో జూలియట్ లాగ చావడానికి సిద్దపడ్డ ప్రేమలా ఇవీ

కేషుంటే ఖరీదైన బహుమానాలే కొనిపెట్టు
క్లుప్తంగా పనైపోయే మార్గం కనిపెట్టు
టైముంటే అదేపనిగా మాటల్తో మతిపోగొట్టు
లేకుంటే అయామ్‌సారీ మంత్రం సరిపెట్టు
కాగితం పూలకి అంటుకున్న సెంటురా నేటి కొత్త ప్రేమ ఫార్మ్యులా
జీవితం స్కేలులో చిన్న సెంటిమెంటురా అంతకన్న సీనులేదురా

RTS Perm Link

మరణ శాసనం

Feb 12, 2008 Author: శ్రీనివాస | Filed under: మనోగతం

మరణ శాసనం 01మాయమైన నిన్నలో నిలిచిపోని స్నేహమే
మమతలా అల్లిన ఉసురు తీయు పాశమా…

గాయమైన గుండెలో గేయమైన సవ్వడి
ప్రాణమున్న చెవులకు చేరలేదు ఎందుకో…

రాయికైన ఉండదా అణువు అంత చలనము
మగువ మనసన్నది బండరాయిని మించెనా…

నిమిషమెంత భారమో, తలపు ఏమి శూలమో
శిథిలమైన మనిషికి మరణమే శరణ్యమా…

తనకు పెళ్ళిపీటట నేను పాడెమీదట
రెండు కార్యములకీ మేళమొకటే చాలదా…

నింగి నేను చేరగా తనకు శాంతినీయగా
రాసి ఉన్నదెన్నడో ఇది రాతిబ్రహ్మ తలపులో…

RTS Perm Link

ఎద లోతుల్లో ఒక మాటుంది…
నిన్ను కలుసుకుంటున్నప్పుడు… నీ నుండి విడిపోతున్నప్పుడు…
గుండెలో చెప్పలేని బరువు…
కళ్ళలో ఉప్పునీటి చెరువు…

(మరింత పెద్ద బొమ్మ కోసం ఈ బొమ్మ మీద క్లిక్ చెయ్యండి)

ఎద లోతుల్లో 01 (చిన్నది)

RTS Perm Link

బస్సులకు రెక్కలొస్తాయ్…

Jan 2, 2008 Author: శ్రీనివాస | Filed under: మనోగతం

ఏదన్నా పండగొస్తే చాలు.. ఎవరు ఎలా చేసుకున్నా, ఈ ప్రవేటు బస్సువాళ్ళు నిజంగా పండుగ చేసుకుంటారు. ఆ కొన్ని రోజులూ వాళ్ళ బస్సులకు (అంటే రేట్లకు) రెక్కలొస్తాయ్. విశాఖపట్నం వెళ్లాలంటే ఓ వెయ్యి నోటు వదులుకోవాల్సిందే. ఆర్టీసీ బస్సులకు ముందే అయిపోతాయి. ఈ ప్రవేట్ వాళ్లు లేవు లేవంటూనే బ్లాకులో వెయ్యికి పైనే గుంజుతారు (అసలు రేటు 600 చిల్లర). ఆ సమయంలో ఏమీ చేయలేక కొనాల్సొస్తుంది. ఇప్పుడు పరిస్థితి మరీ దారుణం అయిపోయింది. ఆర్టీసీ వాళ్ళు కూడా తెలివిగా టిక్కెట్టులన్నీ బ్లాక్ చేసేసారు. ఇక ప్రవేటు వాళ్లు ఓ అడుగు ముందుకేసి ఏకంగా ఆన్‌లైన్‌లోనే రెట్టింపు రేట్లతో విక్రయిస్తున్నారు. ధనుంజయ, కేశినేని ట్రావెల్స్ సైట్లకెళ్లి 11 వ తారీఖున టిక్కెట్టు వెల చూడండి. 1200/1300 రూపాయలు ఉంటుంది. అయినా మొత్తం అమ్ముడైపోయాయి. ఒకొక్కసారి ఆవేశమొచ్చి ఈ సైట్లను హ్యాక్ చేసిపడెయ్యాలని ఆవేశమొస్తుంది గానీ మనకింకా అంత సీను లేదని తెలుసుకుని మిన్నకుండిపోతాను.

RTS Perm Link

RTS Mirror Widget


from JalleDa

పంచాంగం