ఎన్ని వేల వర్ణాలో…

Archive for the ‘సాంకేతికం’ Category


అప్పుడెప్పుడో తెలుగు బ్లాగు గుంపులో లేఖినిలో ఆటోసేవ్ గురించి చర్చ జరిగింది కదా. ఆనాడు వచ్చిన ఆలోచనల ప్రతిరూపమే శ్రీ పద్మ. ఫైర్‌ఫాక్స్ యొక్క పద్మ ఏడ్-ఆన్ పాత సంచికను కొంచెం మార్చి దీనిలో ఉపయోగించాను.

దీని వలన ముఖ్య ఉపయోగం ఏమిటంటే మీరు టైపు చేస్తున్న దానిని 6 అక్షరాల ఆంగ్లపదమేదైనా సంకేతపదంగా ఇచ్చి ఆటోసేవ్‌ చేసుకోవచ్చు. పొరపాటున విహరిణిని మూసివేసినా లేదా విద్యుచ్చక్తిలో అంతరాయం వచ్చినా తర్వాత మీ విహరిణికి మీరు ముందిచ్చిన సంకేత పదం తెలిపి మీరు టైప్‌ చేసుకున్న వచనాన్ని తిరిగి పొందవచ్చు. దీనిని నేను IE , Firefox లలో పరీక్షించి చూసాను. ఇది ఒక విధంగా చెప్పాలంటే శ్రీ పద్మ = లేఖిని + ఆటోసేవ్‌ :-) . మీరు టైపు చేసే పెట్టెలు చిన్నవిగా ఉన్నాయని అనుకోకండి. మీరు టైపు చేసేకొద్దీ మీ టెక్స్ట్‌కి తగ్గట్టు అవీ పెద్దవవుతూంటాయి.

లంకె: http://harivillu.org/sripadma

RTS Perm Link


సాధారణంగా వెబ్ పేజీలలో ఉన్న forms (ఇక్కడ లాగిన్ పేజ్ అని నా ఉధ్దేశ్యం) లో password అనే field లో మనం ఏం టైప్ చేసినా ప్రతీ అక్షరం చుక్కగా కనిపిస్తుంది. అక్కడనుండి ఏదైనా కాపీ చేద్దామన్నా వీలుకాదు. వాటిని చూడాలంటే SeePassword వంటి సాఫ్ట్‌వేర్స్ ని install చేసుకోవాలి. కానీ చిలిపి జావాస్క్రిప్ట్ వెబ్‌బ్రౌజర్‌లలో మాత్రం ఈ పనిని సులభతరం చేస్తుంది. మీరు చేయవలసిందల్లా జావాస్క్రిప్ట్ ని సపోర్ట్ చేసే బ్రౌజర్ దేనిలోనైనా యహూ, జీమెయిల్ పాస్‌వర్డ్‌ fieldలో ఏదన్నా టైప్ చేయండి. తర్వాత బ్రౌజర్ అడ్రస్ బార్ లో ఈ క్రింది జావాస్క్రిప్ట్ ని పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి.

యాహూ మెయిల్ అయితే

javascript:alert(document.getElementById(“passwd”).value)

జీ మెయిల్ అయితే

javascript:alert(document.getElementById(“Passwd”).value)


అందుకే నెట్ కేఫ్స్ నుండి బయటికి వచ్చేముందు అన్నింటినీ శూన్యం చేసి రండి.

———-

RTS Perm Link

RTS Mirror Widget


from JalleDa

పంచాంగం