ఎన్ని వేల వర్ణాలో…

Archive for the ‘కలగూరగంప’ Category


————- శ్రీనివాస స్వీయ రచన ————-
నవ్వుకున్నాము నిన్నా మొన్నా, నవ్వుకుందాము ఈ రోజంతా,
నవ్వుతూనే ఉందాము మునుముందు…

ఏకమౌదాము చిన్నా పెద్దా, సాగిపోదాము నవ్వుల నదిలా,
నింగీ నేలకు ఔదామా కనువిందు…

పువ్వులనే మురిపించేలా, పువ్వులనే మరిపించేలా , మనసంతా వికసించేలా నవ్వేద్దాం …

గువ్వల కిలకిలలు శృతులుగా నవ్వేద్దాం…

మువ్వల చెవులకు చిల్లులు పడేలా నవ్వేద్దాం…

కష్టాలు అన్ని మన దారినొదిలి పారిపోయేలా నవ్వేద్దాం…

కన్నీళ్ళు కూడ సంతోషంతో చెంపల్ని తడిమేలా నవ్వేద్దాం…

ఎద నొచ్చినా దిగులు లేక నవ్వుతూ చిందులేద్దాం…

యముడొచ్చినా బాద పడక నవ్వుతూ పలకరిద్దాం…

ఈ లోకాన్ని వీడే క్షణంలోనూ నవ్వుతూ వెళ్ళిపోదాం.

RTS Perm Link

నిజం నిప్పురా…

May 14, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
————- శ్రీనివాస స్వీయ రచన ————-
నిజం నిప్పురా, నలుగురికీ చెప్పరా, లేకుంటే ముప్పురా

నిజం అప్పురా, తీర్చేస్తే గొప్పరా, వడ్డీయే తప్పురా

చెవిలో సీసం పోసినట్టు కంటిలో కారం చల్లినట్టు భరించలేమసలు సత్య గరళాన్ని గుండెలో దాచుకుంటే

నిజం తెలిసిన వాడి నవ్వు ప్రశ్నార్థకమో లేక ఆశ్చర్యార్థకమో తెలియదు!

కానీ ఎదుటి వాడికి తెలిసిపోతుంది నువ్వు ఏదో బరువు మోస్తున్నావని

గోడలకి చెవులే కాదు టివీ9 కళ్ళూ ఉంటాయ్

చీకటి బాగోతాల్నీ, బల్ల కింద చేతుల్నీ వెలుగులోకి తెస్తుంటాయ్

చివరికి నిజానికీ విసుగొస్తుంది – ప్రపంచం ముందు తేనే ముద్దాయిలా నిలబడుతుంది

పట్టు పరుపుల మీద దొర్లిన పరువంతా పాపం కోర్టు బోనులో నీరసించి చతికిలపడి పోతుంది

శ్వేతసౌధంలా అశ్లీల చిత్రమవుతుంది.

RTS Perm Link

————- శ్రీనివాస స్వీయ రచన ————-
ఓ ప్రియా…
వెన్నెల వాకిట నిలచిన నన్ను చీకటి మాటుకు చేర్చావు
నందనవనమున వేచిన నన్ను శిశిరపుజ్వాలై కమ్మావు
నీ తనువువిరికి హృదయతావి లేనప్పుడు నువ్వు అప్సరసవు కాదు
నీ కంటిచూపులో కరుణకాంతి లేనప్పుడు నువ్వు దేవతవూ కాదు
మరి నువ్వెవరివి ; నువ్వెవరివి…
నా జీవనరాగంలో దేవుడు పలికించిన అపశృతివి నీవు
నా ప్రణయయాగంలో ఎదను బలిగా కోరిన క్షుద్రిణివి నీవు
నా యవ్వనరాజ్యంలో నిశ్శబ్దమేలే మరుభూమివి నీవు
నా ఆశలసంద్రంలో కల్లోలిత సుడిగుండానివి నీవు
నా ఆశయమార్గంలో నీడనివ్వని టేకు చెట్టువు నీవు
నా ఊహలఊయలలో నిదురనివ్వని జోలపాటవు నీవు.

RTS Perm Link

ఓ లుక్కేసుకోండి!

May 12, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
నేను 3 సంవత్సరాల క్రితం సరదాగా డిజైన్ చేసిన వాల్ పేపర్స్ (800 x 600). అప్పుడు కంప్యూటర్స్ మీద అంత పరిజ్ఞానం లేకపోయినా తెలుగు మీద మమకారంతో వీటిని తయారు చేసాను. ఓ లుక్కేసుకోండి.

RTS Perm Link

RTS Mirror Widget


from JalleDa

పంచాంగం