ఎన్ని వేల వర్ణాలో…

చెప్పుకోండి చూద్దాం ?

Aug 27, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప

కాలానికీ గడియారానికీ ఉన్న సంబంధం ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? కోంచెం సంప్రదాయబద్దంగా ఆలోచించండి. సమాధానం పక్కనే ఉన్న చిత్రంలో ఉంది.

RTS Perm Link

నీ ప్రేమకై…

Aug 23, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప

కోటి ఊహలను ఊపిరిగా చేసుకుని…

లక్ష ఆశలను రేపటిలో చూసుకుని…

వేయి ఊసులను గుండెల్లో దాచుకుని…

వంద జన్మలను వారధిగా చేసుకుని…

నిన్ను మాత్రమే ప్రియతమగ తలచుకుని…

బ్రతుకుతున్నాను నీ ప్రేమకై…

RTS Perm Link

ఓ యువరాజు మనోగతం

Aug 23, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
నేనే రాజును… యువరాజును…
తాతకుండక రాజ్యము… తండ్రికొసగక భాగ్యము… తల్లి మరిచెను సౌఖ్యము…
ఇంట మిగిలెను పాత మకుటము… పదును పోయిన ఖడ్గము… పరుగుతీయని అశ్వము…
నన్ను చదివింపనెంచిన నా తండ్రికొచ్చెను కష్టము…
మా బాగోగులు చూడడానికే గడిచిపోయెను తల్లి జీవితం…
బడికి పంపగ నన్ను పాపం హారతాయెను తండ్రి జీతము…
కళాశాలలో నన్ను చేర్చగ ఇల్లు మారెను ఖడ్గము…

పట్టభద్రుడినవ్వగా మరి కరిగిపోయెను మకుటము…

మాకు భారము ఎందుకంటూ మట్టినొదిగెను అశ్వము…

పదిలమ్ముగా దాచుకోగా చివరికి మిగిలెనే ఈ కలం…

అమ్మనాన్నల ఆశ తీరే క్షణమెప్పుడో… ఇంకెప్పుడో…

వాళ్ళ ఋణమును తీర్చుకునే తరుణం ఇంకెన్నడో…

- శ్రీనివాస స్వీయరచన

RTS Perm Link

నిజ సౌందర్యం

Aug 17, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప

ఓ ప్రియా! నువ్వెవరో నాకు తెలియదు. ఎప్పుడో కంటి ముందు కదిలిన నీ రూపు ఇంకా అస్ఫష్టమే!

కానీ స్వప్నసీమలలో నన్ను తాకిన నీ అలౌకిక స్పర్శ నాకు సుపరిచితమే…

ఇప్పుడేమి జరిగిందో తెలుసునా…

నీ తలపుల రథం నన్నో పూలతోట ముందుకు చేర్చింది నిన్ను చూపిస్తానంటూ…

నేను వడివడిగా ఆ వనద్వారం దాటుకుంటూ లోనికి వెళ్ళిపోయాను…

అబ్బో! ఎక్కడ చూసినా రంగు రంగుల పూలు; అందమైన పూలు. ఏ పువ్వులో నువ్వు దాగున్నావో తెలియదు…

ఆత్రంగా ఒక్కో పువ్వునూ తాకుతున్నాను… అమ్మో! ప్రతీ పువ్వుకీ కనిపించని ముళ్ళు…

ఆ తోట అంతా తడిమి చూసేసరికి నా కళ్ళు అలసిపోయాయి… నా చేతులు రక్తమయమైపోయాయి… కానీ ఏదీ నిన్నటి ఆ అలౌకిక స్పర్శ…

నిస్తేజుడనై, నిర్వేదుడనై వనం బయటకి చేరుకున్నాను…

అడుగులు తడబడుతూ నడుస్తున్న నాకు ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది…

అహా! అదే స్పర్శ అదే అనుభూతి కదా నువ్వు నిన్న కనుకగా ఇచ్చినది… తలవంచి చూసాను

ఓ గడ్డిపువ్వు నా పాదాగ్రాన్ని సున్నితంగా మీటుతుంది. అంతే ఒక్కసారిగా నా మనసుకు చుట్టుకున్న అజ్ఞానపు సంకెళ్ళు పటాపంచలైపోయాయి…

ఓ చెలీ! నిన్ను పోల్చుకోలేకపోయిందుకు క్షమించవూ…
- శ్రీనివాస స్వీయరచన

RTS Perm Link

RTS Mirror Widget


from JalleDa

పంచాంగం