ఎన్ని వేల వర్ణాలో…
ఏంటో నన్ను గత కొన్ని నెలలుగా వింత అలవాటు పట్టుకుంది. ఏదన్నా ఆంగ్లంలో చదవాల్సి వస్తే ప్రతీదాన్నీ RTSలో చదువుతున్నాను. RTS పరిచయం కాక ముందు ఒకసారి ICICI ని ఇకికి అని సరదాగా చదివా; అప్పటినుండి ఆ పేరు కనిపిస్తే చాలు ఇకికి అని నోట్లోకొచ్చేస్తుంది. ఇక RTS తోడయాకా ఆ అలవాటు ముదిరిపోయింది. ఈ మద్యన ఒకసారి ఐడియల్ బ్రెయిన్ లో వెదుకు (veduka) అని ఒక సినిమా పేరు చూసి పలికా. అంతే నా పక్కోడు అది వేడుక అని చెబితేగానీ నేను దానిని ఏ పద్దతిలో చదివానో అర్దం చేసుకోలేకపోయా! మొన్నయితే మాకు కొత్త ప్రాజెక్ట్ గురించి ఒక మెయిల్ వచ్చింది; అందులో దాని పేరు Nene అనుంది. నెనె అని నేను దాన్ని గుర్తుంచుకుంటే తర్వాత తెలిసింది దాని పేరు నీన్ అని !
తలకట్టు, వట్రువసుడి, తీయదనమూ…
ఎవరినీ మెప్పించలేకపోతున్నాయ్!
నేటి కాలపు గందరగోళాన్ని వర్ణించలేక పోతున్నాయ్!
అందుకేనేమో సాలార్జంగు మ్యూజియంలో ఓ గది …
తెలుగక్షరాల్ని నింపుకోవడానికి ఆబగా ఎదురుచూస్తూంది.
నా మనవడు… చాలా ఎదిగిపోయాడు…
ఉగాది రోజు బారెడు పొద్దెక్కినా లేవలేదు…
స్నేహితుల దినాన ఓ వెయ్యినోటు చేతబట్టుకుని…
ఉదయాన్నే హుషారుగా పోయాడు తిరుగుళ్ళకి…
ఇక మునుముందు తరాలన్నీ అనాథలమయం…
ఎవరికీ అమ్మానాన్నలుండరు…
వాళ్ళే పిల్లలకి నూరిపోస్తున్నారు మమ్మీడాడిలంటూ…
వాళ్ళకి సవతులు వాళ్ళే!
అందమైన అమ్మాయి; చేతిలో పుస్తకాలు…
కనిపించకుండా తాళి; కాళ్ళకేమో మట్టెలు…
మధ్యాహ్నమాటకి ఐమాక్స్‌కి వచ్చింది…
పక్కనుంది మొగుడా లేక బాయ్‌ఫ్రెండా?
పక్కింటి సుబ్బారావుగారు…
దగదగా మెరిసే పట్టు వస్రాలతో వెలిగిపోతుంటారు…
కొడుకు సంపాదన ఇంట్లోకి ఒంట్లోకి అన్నీ కొనిపెడుతుంది…
మనసులో వెలితిని మాత్రం నింపలేకపొతుంది…
వాడెప్పుడొస్తాడో మరి అమెరికా నుండి!
ఆ రోజుల్లో అయితే… చిన్నపిల్లల్లా బయట అందరమూ చేరి…
దీపావళి రోజున పటాసులు గట్రా కాలుస్తూ తెగ ఆనందపడిపోయేవాళ్ళాం…
ఇప్పూడేమో రోజూ బయట ఎవడేం పేలుస్తాడో అని ఇంట్లోనే మగ్గిపోతున్నాం.
అప్పుడెప్పుడో తెలుగు బ్లాగు గుంపులో లేఖినిలో ఆటోసేవ్ గురించి చర్చ జరిగింది కదా. ఆనాడు వచ్చిన ఆలోచనల ప్రతిరూపమే శ్రీ పద్మ. ఫైర్‌ఫాక్స్ యొక్క పద్మ ఏడ్-ఆన్ పాత సంచికను కొంచెం మార్చి దీనిలో ఉపయోగించాను.
దీని వలన ముఖ్య ఉపయోగం ఏమిటంటే మీరు టైపు చేస్తున్న దానిని 6 అక్షరాల ఆంగ్లపదమేదైనా సంకేతపదంగా ఇచ్చి ఆటోసేవ్ చేసుకోవచ్చు. పొరపాటున విహరిణిని మూసివేసినా లేదా విద్యుచ్చక్తిలో అంతరాయం వచ్చినా తర్వాత మీ విహరిణికి మీరు ముందిచ్చిన సంకేత పదం తెలిపి మీరు టైప్ చేసుకున్న వచనాన్ని తిరిగి పొందవచ్చు. దీనిని నేను IE , Firefox లలో పరీక్షించి చూసాను. ఇది ఒక విధంగా చెప్పాలంటే శ్రీ పద్మ = లేఖిని + ఆటోసేవ్
. మీరు టైపు చేసే పెట్టెలు చిన్నవిగా ఉన్నాయని అనుకోకండి. మీరు టైపు చేసేకొద్దీ మీ టెక్స్ట్‌కి తగ్గట్టు అవీ పెద్దవవుతూంటాయి.
అద్దె ఇంటిని వదిలి సొంత గూటికి చేరానోచ్…
నూతన బ్లాగ్విలాసము: http://blog.harivillu.org/